🙏🙏 *శిబి చక్రవర్తి గురించి తెలుసుకుందాం!!*🦚
❄️ ఒకరోజు ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలసి తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు. డేగ రూపం లోని ఇంద్రుడు పావురంరూపంలో అగ్నిదేవుని తరముతూ ఉన్నాడు. ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబి చక్రవర్తిని చూసి "రాజా! ఇది నాకు ఆహారం. దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను" అని అడిగింది. శిబి చక్రవర్తి "ఈ పావురం నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మంకాదు. నీవు వేరే ఆహారం చూసుకో" అన్నాడు. డేగ శిబితో "రాజా! ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం. దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో" అని చెప్పింది. అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేసాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి ఆశ్చర్య పడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు. అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి "రాజా! నీ త్యాగనిరతికి సంతోషించాము. నీకీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది" అన్నారు.
⚖️🛕 *తిరుమలలో తులాభారం మొక్కుబడి వివరాలు తెలుసుకుందాం!!*
🌟 *తిరుమల తులాభారం తిరుమలలోని శ్రీ వారికి ధన రూపేణ, వస్తు రూపేణ కాని ఇచ్చే కార్యక్రమం. ఈ తులాభారం ద్వారా మనిషియొక్క బరువుకు తగినంత సమర్పించుకొనే అవకాశము టి.టి.డి. బోర్డు భక్తులకు కల్పించించి. ఎవరైనా వారి వారి శక్తి అనుసారము తులాభారము ద్వారా వారికి తోచిన వస్తువులను, ధనమును కానీ సమర్పిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది.[1]
తిరులారాయ మండపం దగ్గర తులభారం కనిపిస్తుంది. సంస్కృతంలో "తుల" అంటే త్రాసు అని అర్థం. పాత రోజుల్లో రాజులు "తులపురుషదానం" చేసేవారు. భక్తులు తమ వ్యాధులు నయం అయినప్పుడు వారు ఇవ్వాలనుకున్నట్లు డబ్బు చెల్లిస్తారు. స్వామి అనుగ్రహం పొందిన భక్తులు వారి బరువుకు లేదా వారి పిల్లల బరువుకు సమానమైన డబ్బు స్వామికి సమర్పించడమే తులాభారం. అవసరమైతే తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాణేలను కూడా అందిస్తుంది.[2]
తులభారం అనేది హిందూ ఆచారం, ఇది ద్వాపర యుగం నుండి ఆచరించబడింది, తులాభరం అంటే తనను సమాన బరువు గల వస్తువులను చెల్లించడం. భక్తుల ప్రార్థనలు నెరవేరినప్పుడు దేవునికి వారి బరువుకు సమానమైన బంగారం, పండ్లు లేదా ధాన్యాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు బియ్యం, పంచదార, బెల్లం, పటిక బెల్లం, నాణేలను సమర్పిస్తారు.
🙏🙏 *గోవిందం పరమానందం!!!*🪷🪷