తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం, ప్రతిరోజూ ఉదయాన్నే స్వామివారికి జరిగే మొట్టమొదటి ఆరాధనలో ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు.
తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కైంకర్యాలు జరుగుతాయి. ఈ శాస్త్ర నియమాల ప్రకారమే నవనీత సమర్పణ కూడా సాగుతుంది.
మొదటి నైవేద్యం (బాల భోగం).. ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవ ముగిసిన వెంటనే, స్వామివారి గర్భగుడి తలుపులు తెరిచి "శుద్ధి" (శుభ్రం) చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి సమర్పించే మొట్టమొదటి నైవేద్యం "దర్శన గో-క్షీరం" (పచ్చి పాలు), మరియు "నవనీతం" (తాజా వెన్న).
కలియుగ దైవమైన శ్రీనివాసుడు వేరొకరు కాదు, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడే అనే నమ్మకంతో ఆయన బాల్య రూపాన్ని స్మరిస్తూ ఈ వెన్నను సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం కొన్ని శతాబ్దాలుగా ఎటువంటి విరామం లేకుండా సాగుతోంది.
"నవనీత సేవ" మరియు తయారీ విధానం
సాధారణ ప్రసాదాల లాగా కాకుండా, ఈ నవనీత ప్రసాదం తయారీ అత్యంత పవిత్రంగా, సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ప్రస్తుతం దీని కోసం టిటిడి (TTD) ప్రత్యేకంగా "నవనీత సేవ" అనే ఒక స్వచ్ఛంద సేవను కూడా ప్రవేశపెట్టింది.
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర నైపుణ్య గోశాల (SV Gosala) నుండి సేకరించిన దేశవాళీ ఆవుల పాలను మాత్రమే ఈ ప్రసాదానికి ఉపయోగిస్తారు.
కవ్వంతో చిలకడం..విద్యుత్ యంత్రాలు వాడకుండా, కేవలం మట్టి పాత్రలలో లేదా సాంప్రదాయ గిన్నెలలో కవ్వం సహాయంతో చేతితోనే పెరుగును చిలికి వెన్నను సేకరిస్తారు.
ఈ సేవ కోసం ఆన్లైన్ ద్వారా ఎంపికైన మహిళా భక్తులు (శ్రీవారి సేవకులు) గోశాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో, గోవింద నామస్మరణ చేస్తూ ఉదయాన్నే ఈ వెన్నను తయారు చేస్తారు.
ఇలా చిలికి తీసిన తాజా, తెల్లటి వెన్నను (ఉప్పు లేని స్వచ్ఛమైన వెన్న) ఒక పవిత్రమైన పాత్రలోకి తీసుకుంటారు.
దీనికి కొద్దిగా మిశ్రీ (పటిక బెల్లం పలుకులు)లేదా పంచదార కలుపుతారు.
అనంతరం, ఈ నవనీతాన్ని ఒక వెండి గిన్నెలో ఉంచి, పైన తులసి దళాలు సమర్పించి, మంగళ వాయిద్యాలు, శంఖ నాదాల నడుమ గోశాల నుండి ఊరేగింపుగా ఆలయంలోని గర్భగుడికి తరలిస్తారు.
గర్భగుడిలో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత, ఈ నవనీత ప్రసాదాన్ని తమలపాకులో భక్తులకు అందజేస్తారు.
నవనీత సేవలో పాల్గొన్న స్వామి వారి భక్తులు అక్కడి విశేషాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు