తిరుమల శ్రీ వెంటెశ్వర స్వామి కి కూడా ఒక పర్సనల్ టైలర్ వున్నాడని మీకు తెలుసా..?
శ్రీవారు కొందరికి అరుదైన సేవ భాగ్యాన్ని వివిధ రూపాల్లో అందిస్తూ ఉంటారు. కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి సేవ భాగ్యం ఓ సాధారణ టైలర్ కు లభించింది. స్వామి వారి ముందు నిలబడే పరదాలు., కురాలాలు తాయారు చేసే భాగ్యం ఆయనకు దక్కింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swamy) ఒక్క సారి దర్శించుకుంటేనే పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాం. అలాంటిది శ్రీవారి ఆలయంలో కైకర్యాలు నిర్వహించే అర్చకులది ఎన్ని జన్మల పుణ్యఫలమో అంటూ అనుకుంటాం. శ్రీవారు కొందరికి అరుదైన సేవ భాగ్యాన్ని వివిధ రూపాల్లో అందిస్తూ ఉంటారు.
కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి సేవ భాగ్యం ఓ సాధారణ టైలర్ కు లభించింది. స్వామి వారి ముందు నిలబడే పరదాలు., కురాలాలు తాయారు చేసే భాగ్యం ఆయనకు దక్కింది. నెల రోజుల పాటు దీక్ష చేసి... ఆ దీక్షలో స్వయంగా తన చేతితోనే పరదాలు., కురాలాలు తాయారు చేస్తారు. ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారికి ఈ పరదాలు., కురాలాలు అందించే భాగ్యం ఆయన సొంతం.
తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు మణి. పరదాలు తాయారు చేయడంలో అద్భుతమైన కళానైపుణ్యం కలిగిన వ్యక్తి. 1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని తయారు చేసారు.
అమ్మ చల్లని కరుణ., అయ్యవారికి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు పరదాలు తాయారు చేయాలనీ టీటీడీ నుంచి వచ్చిన ఆదేశాలతో శ్రీవారికి పరదాలు తయారు చేయడం ప్రారంభించాడు.
ఆలా గత 24 ఏళ్లుగా స్వామి వారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తున్నారు మణి. స్వామి వారికీ పరదాలు సమర్పిస్తుండటంతో అప్పటి నుంచి సాధారణ మణి కాస్త పరధాల మణిగా బిరుదు ఇవ్వడం విశేషం.
స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరదాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు. ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రతిమ, ఐరావతం, శంఖు చక్రాలు అమర్చారు. ఇక కుల శేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు., తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేసారు.
"చాల అరుదైన భాగ్యం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతం. తిరుపతిలో జన్మించి ఆ స్వామి వారికి సేవ చేసే విధంగా ఆ స్వామే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం శ్రీవారికి పట్టు పరదాలు సమర్పిస్తూ రావడం 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
మూడు రకాల పరదాలు., రెండు కురాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామి వారికి సమర్పించడం చాల సంతోషాన్ని ఇస్తుంది. స్వామి వారి గర్భాలయంకు అనుకోని ఉన్న కులశేఖర పడికి., రాముల వారి మేడకు., జయవిజయ ద్వారాలకు మూడు పరదాలు., స్వామి వారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తాం.
పరదాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ముందు వచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాం. అనంతరం కాలిబాటగా తిరుమలకు చేరుకొని పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి.. వరాహ స్వామి దర్శనం చేసుకుంటాం.
మంగళవారం నాడు జరిగె కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు స్వామి వారికీ పరదాలు., కురాలాలు అందించడం ఆనవాయితీ. అంత స్వామి వారే నడిపించి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారని నా ప్రగాఢ విశ్వాసం" అని న్యూస్18 తో పరదాల మణి చెప్పారు.
No comments :