Huge response to TTD Diaries and Calendars from Devotees
– ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు
– డిడి తీసి పంపినా పొందవచ్చు
టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన వస్తోంది.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు - 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు - 75 వేలు, పెద్ద డైరీలు - 8.50 లక్షలు, చిన్నడైరీలు - 3 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు - 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు - 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు - 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లు - 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.
ధరలు ఇలా ఉన్నాయి…
– 12 పేజీల క్యాలెండర్ రూ.130/-,
– డీలక్స్ డైరీ రూ.150/-,
– చిన్న డైరీ రూ.120/-,
– టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-,
- 6 పేజీల 3డి డిజిటల్ క్యాలెండర్ రూ.450/-,
– శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-,
– శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-,
– శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-,
– తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/-.
- టీటీడీ స్థానిక ఆలయాల క్యాలెండర్లు - రూ.130/-.
తిరుమల, తిరుపతిలో....
తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.
బయటి ప్రాంతాల్లో…
చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయిస్తున్నారు.
అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల కోసం డైరీలు, క్యాలెండర్లు సిద్ధంగా ఉంచారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు
అదేవిధంగా డైరీలు, క్యాలెండర్లు టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. ఇందులో 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ, చిన్న డైరీ, టేబుల్ టాప్ క్యాలెండర్, 6 పేజీల 3డి క్యాలెండర్ లను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు తపాలా శాఖ ద్వారా పంపబడుతుంది.
డిడి తీసి పంపొచ్చు…
భక్తులు డిడి తీసి పంపినా టిటిడి క్యాలెండర్, డైరీలను పొందవచ్చు. ఇందుకోసం " కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి " పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ష డెప్యూటీ ఈవో, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి " అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా తపాలా శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
క్యాలెండర్, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.
– Available online
– Demand Draft (DD)is also available
Tirumala, 11 December 2025
The 2026 calendars and diaries printed by TTD have been receiving an overwhelming response from the devotees across India and abroad.
For the convenience of the devotees, TTD has printed and made available the following for the year 2026:
– 12-page calendars: 13 lakh
– 6-page calendars: 75,000
– Big diaries: 8.50 lakh
– Small diaries: 3 lakh
– Table-top calendars: 1.50 lakh
– Large calendars of Lord Venkateswara: 2.50 lakh
– Large calendars of Goddess Padmavathi: 10,000
– Combination calendars of Lord Venkateswara & Goddess Padmavathi:
3 lakh
– Calendars of local TTD temples: 10,000
Prices
– 12-sheet calendar: ₹130
– Deluxe diary: ₹150
– Small diary: ₹120
– Table-top calendar: ₹75
– 6-page 3D digital calendar: ₹450
– Large Lord Venkateswara calendar: ₹20
– Goddess Padmavathi calendar: ₹20
– Lord Venkateswara & Goddess Padmavathi calendar: ₹15
– Telugu Panchangam calendar: ₹30
– Local TTD temple calendars: ₹130
Availability in Tirumala & Tirupati
Calendars and diaries are available at:
– Sales Centre opposite TTD Administrative Building
– Dhyanamandiram near Sri Govindaraja Swamy Temple
– Srinivasa Complex
– Vishnunivasam
– TTD Publication stalls in Tiruchanoor
Other Cities:
Sales are also available at:
– Chennai: Sri Venkateswara Swamy & Sri Padmavathi Ammavari Temples
– Hyderabad, Bengaluru, Vijayawada, Visakhapatnam TTD Temples
– Mumbai, New Delhi, Vellore, Kanchipuram Information Centres
– TTD Kalyanamandapams in Nellore, Rajahmundry, Kakinada, Kurnool
– Sri Kodandarama Swamy Temple, Ontimitta
– Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa
– Other TTD-affiliated temples
Online Booking
Devotees can book 12-sheet calendars, deluxe diaries, small diaries, table-top calendars, and 6-page 3D calendars online through the TTD websites:
www.tirumala.org / ttdevasthanams.ap.gov.in
Booked items will be delivered by the Postal Department.
Through Demand Draft (DD)
Devotees may also obtain calendars and diaries by sending a Demand Draft.
The DD should be taken in favour of:
“Executive Officer, TTD, Tirupati”
and sent along with a covering letter to:
The Deputy EO,
Book Publications & Sales Department,
Press Compound, K.T. Road, Tirupati.
The calendars/diaries will be sent through the Postal Department.
Postal delivery charges must be paid additionally.
For more details, devotees may contact: 0877-2264209
#tirupati #ttd #tirumala
#TTDDiariesCalendars

No comments :