*Online లో 300/- Special Entry Darshan బుకింగ్ కాకపోయినా మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే *ఇంకా మీకు నచ్చిన (క్రింద చెప్పిన) 3 పద్దతులలో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.*
*1)టోకెన్ సర్వ దర్శనము (Time Slot Darshan / Token Sarva Darshan)*
*2)దివ్య దర్శనము (కాలి నడక* *దర్శనము )*
*3)జనరల్ సర్వ దర్శనము ( ధర్మదర్శనం)*
*1) టోకెన్ సర్వ దర్శనము - (Time Slot Darshan / Token Sarva Darshan)*
*సర్వ దర్శనం కు సంబందించిన టోకెన్ లను ప్రతి రోజు 20,000 నుండి 25,000 భక్తులకు అవకాశం కల్పిస్తారు.*
*సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు*
*a)తిరుపతిలోని విష్ణునివాసం (near రైల్వే స్టేషన్)*
*b)శ్రీనివాసం కాంప్లెక్స్, (Near RTC Bus Stand)*
*c)గోవిందరాజస్వామి సత్రాల (Near Railway Station) వద్ద*
*పైన తెలిపిన కేంద్రాల వద్దకు వెళ్లి మీ ఆదార్ కార్డును చూయించి టోకెన్ సర్వ దర్శనం ను తీసుకోవాలి. టోకెన్ మీద ఉన్న సమయం కు దర్శనం కు వెళ్ళితే మీకు 3-4 గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తీ అవుతుంది.*
*2) దివ్య దర్శనము టోకెన్ (కాలి నడక దర్శనం)*
*(కోవిడ్ వలన దాదాపు మూడు సంవత్సరాల నుండి ఆపి వేశారు. 01-04-2023 మళ్లి ప్రారంభం అయింది.*
*ఇది నడక దారి ద్వారా వెళ్ళే భక్తులకు దివ్య దర్శనము (కాలి నడక దర్శనం) టోకెన్ ఇవ్వబడుతుంది. అయితే కాలినడక 2 మార్గాల ద్వారా వెళ్ళవచ్చు.*
*శ్రీవారి మెట్టు నడక మార్గం (మొత్తం 2388 మెట్లు) కు వెళ్ళాలంటే తిరుపతి నుండి 17 కి . మీ దూరంలో వుంటుంది . RTC Bus సౌకర్యం మరియు Auto and Jeep సౌకర్యాలు వుంటాయి.*
*శ్రీవారి మెట్టు నుండి ఉదయం 6.00 నుండి దివ్య దర్శనము (కాలి నడక దర్శనం) టోకెన్ లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రోజు శ్రీవారిమెట్టు మార్గంలో 1250 వ మెట్టు చేంత 5 వేల దివ్యదర్శనం టోకెన్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి కేటాయిస్తున్నారు. టోకెన్ కోట పూర్తయ్యే వరకు ఇస్తూ ఉంటారు.*
*అలిపిరి నడక మార్గం (మొత్తం 3750 మెట్లు) వెళ్ళాలంటే తిరుపతి నుండి 4 కి . మీ దూరంలో వుంటుంది . RTC Bus సౌకర్యం మరియు Auto and Jeep సౌకర్యాలు వుంటాయి.*
*అలిపిరి నడక మార్గంలో తిరుమల కు వెళ్లే వారికి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ లు ప్రతి రోజు ఉదయం 3.00 నుండి ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ కోటా పూర్తయ్యే వరకు ఇస్తూ ఉంటారు.*
*ఇది పొందిన తర్వాత టోకెన్ మీద ఉన్న సమయం కు దర్శనానికి వెళ్ళితే మీకు 3-4 గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తి అవుతుంది.*
*౩) జనరల్ సర్వ దర్శనము ( ధర్మదర్శనం)*
*పైన చెప్పిన ఎలాంటి టోకెన్ (టోకెన్ సర్వ దర్శనము (Time Slot Darshan / Token Sarva Darshan) లేదా దివ్య దర్శనము టోకెన్ (కాలి నడక దర్శనం) లు లేకపోయినా / దొరకక పోయినా భాద పడవలసిన అవసరం లేదు.*
*మీరు తిరుమల చేరుకొని నేరుగా సర్వ దర్శనం కంపార్టుమెంటు లోకి వెళ్లి కూడా దర్శనం చేసుకోవచ్చు. కాని దీనికి ఇంత సమయం లో దర్శనం పూర్తి అవుతుందని చెప్పలేం. ఓపికతో వుండి దర్శనం చేసుకోవాలి . కొన్ని సందర్భాలలో కొన్ని గంటల్లో పూర్తీ కావచ్చు లేదా ఒక రోజు కూడా పట్టే అవకాశం లేక పోలేదు.*
No comments :