*అంగప్రదక్షిణం అంటే అర్థం*
'అంగప్రదక్షిణం' 'అంగ' అంటే శరీరం, మరియు 'ప్రదక్షిణం' అంటే ప్రదక్షిణం(పొర్లు దండాలు)
వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే కొండ క్రింద ఉన్న ఊరు) అంగప్రదిక్షణ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి
2. అంగప్రదిక్షణ టికెట్స్ ప్రతిరోజూ 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు .12 సంవత్సరాల లోపు వున్నచిన్నపిల్లలకి టికెట్స్ అవసరంలేదు .
3.రాత్రి 1.30 లోపు వైకుంఠం1 దగ్గరకు మీరు చేరుకోవాలి.
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం1(ATC సర్కిల్ దగ్గర)
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఆన్లైన్లో ఇస్తారు.
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు మాత్రమే అనుమతినిస్తున్నారు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .
No comments :