1715 ఆగష్టు నెల 2వ తేదీన స్వామి వారికి మొదట బూందీ ప్రసాదంగా అందజేశారు. ఆ తర్వాత ప్రత్యేక బూందీ పోటు ఏర్పాటు చేసి లడ్డూలను తయారు చేయడం ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదం 1715 సంవత్సరంలో ప్రారంభమైనట్లు నమ్ముతారు, అయితే లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన పదార్థాల జాబితా (దిట్టం) మరియు నిష్పత్తులను 1950లో టిటిడి ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. Tirumala: తిరుమల లడ్డు ఎప్పటి నుంచి తయారీ.. శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
ఇల వైకుంఠం క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన స్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత శ్రీవారి లడ్డుని కొనుగోలు చేస్తారు. అవును స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రీవారి ప్రసాదం లడ్డుకి అంతే ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే వెంటనే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. ఈ లడ్డు రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రస్తుతం 5000 లడ్డూల తయారీకి 852 కేజీల ముడి సరుకులు వినియోగిస్తున్నారు. అందులో 185 కేజీల ఆవు నెయ్యి, 200 కిలోల శనగపిండి, చెక్కర 400 కిలోలు, జీడిపప్పు 35 కేజీలు, ఎండుద్రాక్ష 17 కేజీలు, కలకండ 10 కేజీలు, యాలుకలు 5 కేజీలు వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 3 లక్షల లడ్డూలని తయారు చేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.
No comments :