🕉 ఏడు కొండలు 🕉
💠 తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే.అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు .ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది .ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది
💠 ఇందులో మొదటిది శ్రీశైలం .
ఇది ఇంచుమించు తమిళంలోని తిరుమలై అనే మాటకు సరిపోయ్ పదభందం .
తిరు మంగళవాచకం .మలై అంటే కొండ .శ్రీదేవి నివసిస్తుండడం వల్ల ,భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది.
💠 రెండవది శేషశైలం .
శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత శేషశైలం శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా ,శేషుడు వెంకటాద్రిని ఆవరించగా ,వాయువు మహావేగంతో వీచగా ,శేషుడు సువర్ణముఖరీతీరం దాకా కదిలిపోగా ,స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో ,శేషుడు తపం అవరించడం వల్ల శేషపర్వతఖ్యాతి వచ్చింది .
💠 మూడవది గరుడాచలం .
శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం.
💠 నాల్గోవధి వేంకటాద్రి .
వేo కారానికి అమృతమని అర్ధం .కటం అంటే ఐశ్వర్ర్యం.ఆశ్రితులకు అమృతాన్ని ,ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం .లోకంలోని పాపాలకు వేoఅని వ్యవహారం .ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం.
💠 ఐదవది నారాయణాద్రి .
సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి.
💠 ఆరవధి వృషభాద్రి .
వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా ,తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు అనుగ్రహించడం వల్ల వృషబాద్రి.
💠 ఇక చివరది వృషాద్రి.
వృష శబ్దానికి ధర్మమని అర్ధం .తన అభివృద్ధికోసం .ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి.
💠 ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది .
వరాహపురాణం ప్రకారం కృత యుగంలో అంజనాద్రి ,
త్రేతా యుగంలో నారయణగిరి ,
ద్వాపరయుగంలో సింహశైలం ,
కలియుగంలో వెంకటాచలం .
💠 బవిషోత్తర పురాణం ప్రకారం ..
కృతయుగంలో వృషాద్రి ,
త్రేతాయుగంలో అంజనాచలం ,
ద్వాపరయుగంలో శేషశైలం ,
కలియుగంలో వెంకటచలం అని పేర్లు.
💠 ఇవే కాక చింతామణి, జ్ఞానద్రి, తిర్దాద్రి, పుష్కరాద్రి, ఆనందాద్రి, నీలాద్రి, నరసింహాద్రి, వరహాద్రి, వైకుంటద్రి, శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి .
తమిళ సాహిత్యంలో తిరువేoగడం అనే మాటకు ప్రాచుర్యం అర్ధం .
వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం.
💠 ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు .ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది .
శరీరంలో ఏడు చక్రలున్నాయి .మూలధారం ,స్వాధిష్టనం,మణిపూరకం ,అనాహతం ,విశుద్దం ,ఆజ్ఞ ,సహాస్రారం -అని ,అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ సాక్షాత్కరానికి మార్గమని అంటారు.
No comments :