శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించే #కొప్పెర (హుండి) ను వంశపారంపర్యంగా మా పూర్వీకుల నుండి మాకు రావడం అపురూపమైన అదృష్టం. మొట్టమొదటి సారిగా 25-07-1821న మా పూర్వీకులు శ్రీవారికి కొప్పెరను సమర్పించారు. ఆ తరువాత 25-07-1825న 'సిరికొలువు' పెట్టి కొప్పెర గంగాళానికి వస్త్రం చుట్టి దానిని తొమ్మిదడుగుల ఎత్తులో పెట్టడం జరిగింది. అప్పటినుండి నిరంతరాయంగా తిరుమల శ్రీవారికి కొప్పెర గంగాళం, ఆ గంగాళానికి సంబంధించినటువంటి వస్త్రం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారికి మాకుటుంబీకులు చేస్తున్న కైంకర్యాన్ని గుర్తించి మా పూర్వీకులకు కొంత భూమి కానుకగా ఇచ్చి , కొప్పెరకు కాపలా, ఆదాయవ్యయాలను చూసే బాధ్యతను అప్పజెప్పారు. అప్పటినుండి మా కుటుంబీకులు ఈ కైంకర్యంలో తరిస్తున్నాం. దీనిని కొనసాగిస్తూ నేను కూడా 2016వ సంవత్సరంలో శ్రీవారికి 75 కిలోల బరువుతో ఒక లోహగంగాళాన్ని సమర్పించాను. 04-07-2017న కూడా ఒక గంగాళాన్ని సమర్పించాను. శ్రీవారికి సేవచేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు మాకు కల్పించినందుకు పులకించిపోతుంటాము.
హుండి (కొప్పెర) గంగాళాన్ని తయారు చేయడానికి మరియు దాని కొలతల వివరాలివి -
1) అడుగుభాగం మరియు చెవి, రింగులు తయారు చేయడానికి ఇత్తడిని, చుట్టుకొలతకు రాగిని ఉపయోగిస్తాం.
2) గంగాళం కొలతలు 25 లేక 27 ఇంచీలు, అడుగు భాగం చుట్టుకొలత మరియు ఎత్తుకూడా 25 లేక
27 ఇంచీలుగా ఉండేట్లుగా పెట్టడం జరుగుతుంది.
3) ఒక గంగాళానికి '91/4 మీటరు తెల్లటి గుడ్డను,
4) 40 గంగాళాలకు 6 మీటర్ల పసుపుగుడ్డను,
5) నామానికి సరిపడే అంత అంటే 40 గంగాళాలకు 1.60 మీటర్ల ఎరుపుగుడ్డను సమర్పించుకుంటాము.
ఈ విధంగా పై తెల్పిన కొప్పెర గంగాళానికి వస్త్రాలను భక్తిపూర్వకంగా కానుకగా సమర్పించుకోవడం మా ఆనవాయితీగా వస్తోంది. ఇది మా అదృష్టం. ఆ దేవదేవుడు మాపై చూపిన కృపగా మేము భావిస్తూంటాము.
====================
మా అదృష్టం - శ్రీ కె.సాయిసురేష్
సేకరణ - Svds శర్మ గారు
====================
No comments :