1) ఆన్లైన్ టికెట్లు చేసుకున్న వారు మీతో పాటు కచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
2) ఆన్లైన్ టిక్కెట్లు చేసుకోలేని వారు తిరుపతిలో గల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం , ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసంలో ఉదయం 3 గంటల నుండి ఉచితంగా టైం స్లాట్ ( SSD ) టోకెన్లు పొందవచ్చు.
3) గదుల కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పొందేవారు C.R.O. ఆఫీస్ వద్దకు వెళ్లి రూము పొందగలరు.
4) 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టిక్కెట్టు అవసరం లేదు.
5) కాలినడకన వెళ్లేవారు శ్రీవారు మెట్టు ద్వారా వెళితే మార్గం మధ్యలో టోకెన్ ఇస్తారు. అదే అలిపిరి మార్గంలో వెళ్లే వారికి అలిపిరి స్టార్టింగ్ పాయింట్ వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు ఇస్తారు.
6) కాలినడకన లేదా SSD టోకెన్ పై ఇచ్చిన టైం కి మీరు క్యూలైన్లోకి ప్రవేశిస్తే నాలుగు లేదా ఐదు గంటలు మీకు దర్శనం అవుతుంది.
7) రూములు దొరకని వారు P. A. C.- 1 2 ,3 లలో ఉచితంగా లాకర్లు పొందగలరు.
8) ప్రధాన కళ్యాణ కట్టలు 24 గంటలు తెరిచే ఉంటాయి.
9) ఒక సంవత్సరం లోపు ఉన్న చంటి పిల్లల తల్లిదండ్రులకు సుపధం మార్గం ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపు దర్శనానికి ఉచితంగా వెళ్లవచ్చు. బాబు యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.
10) సీనియర్ సిటిజన్స్ లేదా దివ్యాంగులు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు ఆఫ్ లైన్ లో లేవు.
No comments :