*శ్రీవారి_గడ్డంకి_పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారు దానికి కారణమైన అనంతాళ్వార్ ఎవరు??*
*శ్రీవారి_ఆలయంలో_వున్న_గడ్డపార గురించి తెలుసుకుందాం?*
శ్రీ_అనంతాళ్వార్
శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్, శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించెవారు, ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమలలో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామి వారికి సమర్పించేవారు.
అనంతాళ్వారులు తిరుమలలో పూల తోటకి నీళ్ళ కోసం బావి తవ్వటానికి భార్యని సహకారంగా తీసుకొన్నారు, అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది.
అనంతాళ్వారులుకు ఆ సమయంలో సహాయం చెయ్యటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతాళ్వార్ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు.
బాలుడు అనంతాళ్వారులు భార్య దగ్గరకు వెల్లి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది.
ఆమె మట్టి తట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు, భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు ఆయన భార్యవి అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.
ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు, అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది.
ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్.
అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసిని అనంతాళ్వారులు, అయ్యో..
నేను గునపం విసిరింది ఎవరి మీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని గ్రహిస్తాడు.
స్వామివారి గడ్డం పై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డం పై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు.
ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామి వారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు.
శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు ఉంటుంది, మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు, శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు...
తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా!!!
పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమల లోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరు కూడా సాహసించేవారు కాదు.
అందుకే ఆలయాన్ని సూర్యోదయం తరువాతే తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు.
ఈవిధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూల తోట నిర్మిచుకొన్నారు.
అనంతాళ్వార్ పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతి రోజు స్వామివారికి సమర్పించేవారు. ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు. అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్దుడై తానూ ధరించే పుష్ప మాలలే ఇంత సుందరంగా ఉండే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సుహాసనని చూస్తూ, పూలని కోస్తూ , అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాళ్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు, స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి, ఆ దొంగలని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు.
కానీ స్వామివారు అనంతాళ్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవారు. ఇలా 8 రోజులు జరుగుతూనే ఉండగా, అనంతాళ్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్లి, స్వామి ఎవరో కన్ను గప్పి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారి ప్రార్ధించగా, అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని, ఆచార్య భక్తిని లోకాని తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు.
ఇక అనంతాళ్వార్ తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా, ఒక పొద దగ్గర ఎదో శబ్దం వినిపించింది. అటుగా వెళ్లి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వార్ చూడటానికి రాజా కుటుంబానికి చెందిన వారీగా ఉన్నారు అని తలచి, తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు, ఎవరు మీరు అంటూ వెళ్లి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్లగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది. అప్పుడు అనంతాళ్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు. అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాళ్వార్ కి దొరకకుండా మాయమవుతాడు. అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారు జామున వెతుకుదాం అని నిద్రపోతాడు.
ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అప్పుడు స్వామివారు అర్చకులరా అమ్మవారు అనంతాళ్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్లి విడిపించి సగోర్వముగా తీసుకొనిరండి అంటూ పలకడంతో, అర్చకులు తోటలో వెళ్లి, ఎంతటి అదృష్టవంతుడవయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా, జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టంగా నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి తీసుకొనివచ్చాడు. ఈవిధంగా అమంవారిని తీసుకువచ్చిన అనంతాళ్వార్ ని శ్రీవారు మామ అని పలుకుతూ, నీ కూతురిని పూలబుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతవైనా మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారు వక్షస్థలానికి చేరుకుంది.
No comments :