TirumalaHills
TirumalaHills

Social Icons

Pages

  • Buy TTD Calendar
  • TTD Telugu Panchangam
  • Privacy Policy
  • Contact Us
ॐ Welcome to TirumalaHills - Dharmo Rakshati Rakshita - Govinda Govinda Govinda ॐ

Ads

Main Menu

  • Home
  • Tirumala History
    • Tirumala History
    • Darshan
    • Seva
    • Brahmotsavam
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Transportation
    • Free Meals / Anna Prasadam
    • Walking up the Hills
    • Kalyana Katta / Tonsuring
    • Medical Services
    • Tulabharam
    • Niluvudopidi
    • Anga Pradakshinam
  • Booking Services
    • Special Entry Darshan (Rs.300)
    • Free Sarva Darshanam
    • Seva at Tirumala
    • Seva at Tiruchanoor
    • Virtual Seva at Tirumala
    • Virtual Seva at Tiruchanoor
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Hundi @ Tirumala
    • Hundi @ Tiruchanoor
    • Srivani Trust Donations
    • Other Trust Donations
    • Cottage Donations
  • Festivals
    • Srivari Jyeshtabhishekam
    • Srivari Annual Salakatla Brahmotsavam
    • Srivari Annual Brahmotsavam
    • Srivari Navaratri Brahmotsavam
    • Srivari Annual Pavithrotsavam
  • Visiting Places
    • Srivari Pushkarini
    • Sri Bhu Varaha Swamy Temple
    • Kapila Theertham
    • Deer Park Reserve
    • Srivaari Paadamulu
    • Tirumala Museum
    • Silathoranam
    • Papavinasam Theertham
    • Srivari Mettu
    • Alipiri
    • Srinivasa Mangapuram
    • Tiruchanur – Alamelu Mangapuram
    • Matrusri Tarigonda Vengamamba
    • Kanipakam
    • Devuni Kadapa - Kadapa
  • Must Read
    • Most Popular Places
      • Ujjain Mahakaleshwar Jyotirlinga
      • Mahalakshmi Temple, Kolhapur
      • Sri Kanchi Kamakshi Amman Temple
      • Temple in Bhadrachalam
      • Maha Shivaratri
      • Srikalahasti Temple
      • VARANASI – Benares, Banaras or Kāśī
    • Popular Stotrams
      • SECRET HANUMAN RAKSHA MANTRA
      • SHIVA SAHASRA NAMA STOTRAM
      • SRI RUDRAM CHAMAKAM
      • SRI RUDRAM NAMAKAM
      • BILVAASHTAKAM
      • LINGASHTAKAM
      • SHIVASHTAKAM
      • SRI RUDRAM LAGHUNYASAM
      • SRI VENKATESWARA GOVINDA NAMALU
    • Route Map
    • Today Telugu Panchangam
    • Indian Festivals
    • Top Secret Facts of Lord Venkateswara
    • 300 Year Old Tirumala Laddu
    • Sri Venkateswara Suprabhatam
    • Sri Venkateswara Stotram
    • Sri Venkateswara Prapatti
    • Sri Venkatesha Mangalaasaasanam
    • Venkateswara Ashtottara Sata Namavali
    • Govinda Namaavali
    • Sri Srinivasa Gadyam
    • Sri Venkateswara Vajra Kavacha Stotram
  • Keerthanalu
    • Sri Tallapaka Annamacharya
    • Annamayya Keerthanas Part-1
      • Kattedura Vaikuntham
      • Musina Mutyalakele
      • Tiruveedhula Merasi
      • Vinaro Bhagyamu
      • Narayanathe Namo Namo
      • Anni Mantramulu
      • Chandamama Raavo
      • Indariki Abhayambu
      • Adivo Alladivo
      • Tandanana Ahi
      • Manujudai Putti
      • Ekkuva Kulajudaina
      • Kondalalo Nelakonna
      • Shodasa Kalanidhiki
      • Jo Achyutananda
      • Jagadapu Chanuvula
      • Enta Matramuna
      • Brahma Kadigina Padamu
      • Nanati Bathuku
      • Bhavayami Gopalabalam
    • Annamayya Keerthanas Part-2
      • Alara Chanchalamaina
      • Alarulu Kuriyaga
      • Ammamma Emamma
      • Andariki Aadhaaramaina
      • Antaryami Alasiti
      • Ati Dushtuda Ne Nalusudanu
      • Bhaavamu Lona
      • Chaaladaa Brahmamidi
      • Chaaladaa Hari Naama
      • Chaduvulone Harina
      • Chakkani Talliki
      • Cheri Yasodaku
      • Choodaramma Satulaaraa
      • Daachuko Nee Paadaalaku
      • Dasaratha Raamaa
      • Deva Devam Bhaje
      • Deva Ee Tagavu Teerchavayyaa
      • Dolaayaanchala
      • E Puraanamula Nenta Vedikinaa
      • Ee Suralu Ee Munulu
      • Ele Ele Maradalaa

ఆదిత్య హృదయం - Adithya Hridayam with Meanings

Post a Comment Sunday, October 09, 2022
🌿🌼🙏*ఆదిత్య హృదయం*🙏🌼🌿


🌿🌼🙏#ఆర్యగ్య #ప్రదాత #శ్రీ #సూర్య #నారాయణ #స్వామివారి #మహా #మహిమాన్వితమైన #స్తోత్రం #శ్రీ #ఆదిత్య #హృదయం #అర్ధములతో ... 🙏🌼🌿 #పూర్తిగా_చదవండి 
#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి 

🌿🌼🙏ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా ... అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను, అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే దయచేసి షేర్ చేయమని అభ్యర్ధిస్తుంటాను ...  మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్ 🙏🌼🌿

🌿🌼🙏శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది🙏🌼🌿

🌿🌼🙏 ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది 🙏🌼🌿

🌿🌼🙏వారానికి ఒక్కసారైనా ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖ వర్చస్సు మెరుగవుతుంది 🙏🌼🌿

🌿🌼🙏ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు🙏🌼🌿

1.తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 

🌿🌼🙏అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.🙏🌼🌿

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2

🌿🌼🙏అర్థము: యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.🙏🌼🌿

🌿🌼🙏అగస్త్య ఉవాచ:🙏🌼🌿

రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3

🌿🌼🙏అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.🙏🌼🌿

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4

🌿🌼🙏అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.🙏🌼🌿

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5

🌿🌼🙏అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.🙏🌼🌿

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6

🌿🌼🙏అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.🙏🌼🌿

సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7

🌿🌼🙏అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.🙏🌼🌿

ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8

🌿🌼🙏అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు 🙏🌼🌿

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9

🌿🌼🙏అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.🙏🌼🌿

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10

🌿🌼🙏అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.🙏🌼🌿

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11

🌿🌼🙏అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.🙏🌼🌿

హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12

🌿🌼🙏అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.🙏🌼🌿

వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13

🌿🌼🙏అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.🙏🌼🌿

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14

🌿🌼🙏అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.🙏🌼🌿

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15

🌿🌼🙏అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.🙏🌼🌿

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16

🌿🌼🙏అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.🙏🌼🌿

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17

🌿🌼🙏అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.🙏🌼🌿

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18

🌿🌼🙏అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.🙏🌼🌿

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19

🌿🌼🙏అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.🙏🌼🌿

తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20

🌿🌼🙏అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.🙏🌼🌿

తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21

🌿🌼🙏అర్థము: బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.🙏🌼🌿

నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22

🌿🌼🙏అర్థము: రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.🙏🌼🌿

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23

🌿🌼🙏అర్థము: ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.🙏🌼🌿

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24

🌿🌼🙏అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.🙏🌼🌿

ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25

🌿🌼🙏అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.🙏🌼🌿

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26

🌿🌼🙏అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.🙏🌼🌿

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27

🌿🌼🙏అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.🙏🌼🌿

ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28

🌿🌼🙏అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.🙏🌼🌿

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29

🌿🌼🙏అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.🙏🌼🌿

రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30

🌿🌼🙏అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.🙏🌼🌿

అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి

🌿🌼🙏అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.🙏🌼🌿

🌿🌼🙏మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం...🙏🌼🌿

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి 

🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీ హిరణ్యగర్భాయ నమః  " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... మనం ఎంత ఆర్తితో స్మరిస్తే అంత విశేషంగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿

 ఓం శ్రీ హిరణ్యగర్భాయ నమః
Share
Tirumala TirumalaHills

No comments :

Translate

Popular Posts

  • image
    How to send marriage invitation card to Tirumala? పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి
    మొదటి పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి, శ్రీ వారి నుండీ వచ్చే ఆశీస్సులు, కానుకలు పొందండి 🙏🙏🙏 మీ ఇంట...
  • image
    TTD Panchangam 2025 - 2026 (Download PDF)
      TTD Panchangam 2025 - 2026  (Download PDF) TTD Panchangam 2025 - 2026  (Download PDF)
  • image
    శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం / స్తోత్రం / ప్రపత్తి / మంగళాశాసనమ్
    *శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం / స్తోత్రం / ప్రపత్తి / మంగళాశాసనమ్* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 *శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్* 🙏 కౌసల...
  • image
    Tirumala TTD Wedding Prasadam (Kalyana Talambralu)
    Special blessings for all newly weds from Lord Venkateswara. Blessings in return for your Wedding card. Akshintalu, Kumkamam,Kankanam, Ashir...
  • image
    Tirumala Varaha Swamy Temple
      On leaving the Vaikuntha (the celestial abode of Lord Vishnu) Lord Srinivasa hid Himself in an anthill in a forest. One day, he came out o...
  • image
    Tirumala Accommodation
      https://tirupatibalaji.ap.gov.in/#/accommodationCal TTD has built cottages in Tirumala that can be rented by pilgrims. There are 3 categor...
  • image
    తిరుమల కు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి - Appeal to pilgrims travelling to Tirumala in their own cars with their families
    తిరుమల కు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి - Appeal to pilgrims travelling to Tirumala in their own cars with th...
  • image
    Hindu Marriage Calendar
  • image
    Send Wedding Invitation to Tirumala - పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి
    మొదటి పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి, శ్రీ వారి నుండీ వచ్చే ఆశీస్సులు, కానుకలు పొందండి 🙏🙏🙏 మీ ఇంట...
  • image
    Tirumala Angapradakshinam - అంగప్రదక్షిణం అంటే అర్థం
    తిరుమలలో అంగప్రదిక్షణ *అంగప్రదక్షిణం అంటే అర్థం*  'అంగప్రదక్షిణం' 'అంగ' అంటే శరీరం, మరియు 'ప్రదక్షిణం' అంటే ప్రదక్ష...

Loading...

TirumalaHills Archive

  • ►  2025 (9)
    • ►  May 4 - May 11 (1)
    • ►  April 20 - April 27 (2)
    • ►  February 23 - March 2 (2)
    • ►  February 2 - February 9 (1)
    • ►  January 26 - February 2 (1)
    • ►  January 19 - January 26 (1)
    • ►  January 12 - January 19 (1)
  • ►  2024 (29)
    • ►  September 15 - September 22 (2)
    • ►  August 18 - August 25 (2)
    • ►  August 11 - August 18 (2)
    • ►  July 28 - August 4 (2)
    • ►  July 14 - July 21 (2)
    • ►  June 30 - July 7 (1)
    • ►  June 23 - June 30 (2)
    • ►  June 16 - June 23 (1)
    • ►  May 26 - June 2 (2)
    • ►  May 19 - May 26 (1)
    • ►  May 12 - May 19 (2)
    • ►  April 28 - May 5 (1)
    • ►  April 21 - April 28 (1)
    • ►  April 7 - April 14 (1)
    • ►  March 24 - March 31 (2)
    • ►  March 10 - March 17 (1)
    • ►  March 3 - March 10 (1)
    • ►  February 11 - February 18 (1)
    • ►  February 4 - February 11 (1)
    • ►  January 28 - February 4 (1)
  • ►  2023 (19)
    • ►  December 31 - January 7 (1)
    • ►  December 10 - December 17 (1)
    • ►  October 29 - November 5 (2)
    • ►  October 8 - October 15 (1)
    • ►  October 1 - October 8 (1)
    • ►  September 24 - October 1 (1)
    • ►  August 20 - August 27 (1)
    • ►  August 13 - August 20 (1)
    • ►  July 9 - July 16 (2)
    • ►  June 25 - July 2 (1)
    • ►  June 11 - June 18 (1)
    • ►  May 7 - May 14 (2)
    • ►  April 9 - April 16 (1)
    • ►  April 2 - April 9 (1)
    • ►  February 5 - February 12 (1)
    • ►  January 8 - January 15 (1)
  • ▼  2022 (87)
    • ►  December 25 - January 1 (2)
    • ►  November 27 - December 4 (2)
    • ►  November 20 - November 27 (1)
    • ►  November 13 - November 20 (1)
    • ►  November 6 - November 13 (2)
    • ►  October 30 - November 6 (2)
    • ►  October 16 - October 23 (3)
    • ▼  October 9 - October 16 (1)
      • ఆదిత్య హృదయం - Adithya Hridayam with Meanings
    • ►  October 2 - October 9 (1)
    • ►  September 18 - September 25 (3)
    • ►  September 11 - September 18 (1)
    • ►  August 28 - September 4 (1)
    • ►  August 21 - August 28 (9)
    • ►  June 19 - June 26 (30)
    • ►  May 29 - June 5 (23)
    • ►  January 2 - January 9 (5)
  • ►  2021 (71)
    • ►  October 17 - October 24 (1)
    • ►  September 26 - October 3 (1)
    • ►  September 12 - September 19 (1)
    • ►  September 5 - September 12 (4)
    • ►  August 22 - August 29 (2)
    • ►  August 15 - August 22 (3)
    • ►  August 8 - August 15 (12)
    • ►  August 1 - August 8 (22)
    • ►  July 25 - August 1 (25)

Devotees Visits

Article Categories

TirumalaHills (210) Seva (27) Festivals (20) TTD (16) Visiting Places (11) Astrology (8) Muhuratham (8) Video (8) YouTube (8) Accommodation (3) Darshanam (3) SVBC (3) Photos (1)

Write your queries / suggestions

Name

Email *

Message *

Translate

Popular Photos

  • image
    How to send marriage invitation card to Tirumala? పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి
  • image
    TTD Panchangam 2025 - 2026 (Download PDF)
  • image
    శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం / స్తోత్రం / ప్రపత్తి / మంగళాశాసనమ్
  • image
    Tirumala TTD Wedding Prasadam (Kalyana Talambralu)
  • image
    Tirumala Varaha Swamy Temple
  • image
    Tirumala Accommodation
  • image
    తిరుమల కు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి - Appeal to pilgrims travelling to Tirumala in their own cars with their families
  • image
    Hindu Marriage Calendar

Loading...

Chant Om Namo Venkatesaya

Facebook

ॐ TirumalaHills తిరుమలహిల్స్ तिरुमालाहिल्स ತಿರುಮಲಹಿಲ್ಸ್ திருமளாவுக்கு ॐ

Loading...

Search...

Powered by Blogger
All Right Reserved | Copyright © 2008-2021, TirumalaHills.org