మీ ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఒక నెలరోజుల ముందుగా మనము పత్రికను టీటీడీ వారికి పంపాల్సి ఉంటుంది. పోస్టు ద్వారా మనకు స్వామివారి యొక్క అక్షతలు మరియు కంకణాలు ఇతరత్రా పోస్ట్ ద్వారా పంపిస్తారు. అయితే మనం పత్రికల్ని ప్రత్యక్షంగా తీసుకొని మనం తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పోస్టల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్లి మనం పత్రికల్ని ఇచ్చినట్లయితే వాళ్ళు డైరెక్ట్ గా మనకు ఆ స్వామివారి యొక్క అక్షింతలు,
ఒక చిన్న పుస్తకము మిగతా ఐదు వస్తువుని మనకు కవర్లో పెట్టి వాళ్ళు స్పాట్గా ఇచ్చేస్తారు. తిరుపతి పరకామణికి కాయిన్స్ లెక్కించడానికి ఎవరైతే వెళ్తారో వాళ్లకు అక్కడ దగ్గర్లోనే అదే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోనే పోస్టల్ సర్వీస్ సేవా ఉంది. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినా లేదా పరకామానికి సేవ వెళ్లిన మీ మిత్రుల వివాహపత్రికలు తీసుకువెళ్లినట్టయితే మీ మిత్రులకు కానుకగా స్వామివారి యొక్క అక్షంతల్ని మీరు అందించవచ్చు. ఈ సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాను. ఇది ఆఫ్లైన్లో వారు ఇస్తారు. మనము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి ఉన్న ఒక అద్భుతమైన అవకాశం.
వీలైన వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఒకవేళ మీకు ఈ సమాచారం తెలిసినట్లయితే వదిలివేయండి.
ఓం నమో వెంకటేశాయ

No comments :