*తిరుమలకు ఉన్న ఎనిమిది వాడుకదారులు గురించి వివరాలు తెలుసుకుందాం.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ప్రస్తుతం అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్డుఉన్నాయి. అప్పుడప్పుడు కడపజిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంత్రం నుంచి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం అయిన తిరుమల. ప్రతిహిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. భక్తులు రోడ్డు మార్గం లేదా మెట్లు మార్గం ద్వారా తిరుమలకు చేరుకోంటారు. శ్రీవారి ఆలయానికి చేరుకోవాటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రధానమైనది అలిపిరి.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*1. ఆదిపడి లేదా అలిపిరి. క్రీ.శ.1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ.1550లో విజయనగర సామంతులు అలిపిరి, గాలిగోపరం మార్గం నిర్మించారు. మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయింది. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈమార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్ల (12) నడవాలి. అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్టు ఉన్నాయి. సుమారు మూడు నుండి నాలుగు గంటలలో కొండను చేరుకోంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*2. శ్రీవారిమెట్టు. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసమంగాపురం ఉంది. అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి నుండి మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్టు దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*3. మామండూరు అడవి. ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరుదారి. పూర్వం కడప, రాజంపేట కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆతర్వాత పాలసత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పోతే ఈతకాయల మండపం తర్వాత పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భడ్యాం వస్తుంది. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక మార్గంలో పాలసత్రం నుండి దక్షిణ వైపు వెళ్లే కాకుల కొండ వస్తుంది. ఈకాకుల కొండ మీదగా వెళ్తే మామండూరు చేరు కోవచ్చు. ఇప్పటికి అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*4. కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలదొడ్డి నుండి తుంబురుతీర్థం నుండి పాపవినాశానానికి అక్కడ నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం నుండి తుంబురతీర్థానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరు కోవచ్చు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*5. కళ్యాణిడ్యామ్. కళ్యాణిడ్యామ్ కి అనుకున్ని ఉన్న శ్యామలకోన దారిలో పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒకగంటలో భక్తులు తిరుమల చేరుకోవచ్చు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*6. రేణిగుంట నుంచి అవ్వచారికోన దారి. ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం ఉంది. మోకాళ్ళమిట్ట చేరుకున్నాక పక్కనే సారే పెట్టెలను చూడోచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వస్తుంది. మెట్టు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*7. ఏనుగుల దారి. ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి ప్రక్కన ఉండే శ్రీవారిమెట్టు మార్గం నుండి అవ్వాచారికోన వరకూ ఒకదారి ఉండేది ఒకప్పుడు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*8. తలకోన నుంచి. తలకోననుంచి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. అప్పటో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం, నీలిసాని పేట, గాజులమండ్యం, కొల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణవరం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది..... ఓం నమో నారాయణాయ.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments :