1) మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?.
జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి.
విష్ణు నివాసం , శ్రీనివాస0 , భూదేవి కాంప్లెక్స్
లలో మరుసటి రోజు దర్శనానికి ప్రతి రోజు సాయంత్రం 4:00 నుండి కౌంటర్లు ప్రారంభమవుతాయి.
2) SSD టోకెన్లు అంటే ఏమిటి ?
జ) Time Slotted Sarva Darshan మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
3) SSD టోకెన్లు లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి ?
జ) మీరు నేరుగా తిరుమల లోని సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది.
4) మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ?
జ) అలిపిరి మెట్లు మార్గంలో అయితే ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకోవాలి.
శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో 1200 మెట్టు వద్ద టోకెన్ స్కానింగ్ చేసుకోవాలి.
5) చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కల్పిస్తారు.
జ) ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. స్తుపతం ద్వారా వెళ్ళవచ్చు.విశేష పర్వదినాల్లో దర్శనాలు రద్దు చేస్తారు.
6) చిన్నపిల్లల దర్శన్లు ఎవరెవరు వెళ్లవచ్చు ?
జ) చిన్నపిల్లలు ఒక సంవత్సరం లోపు వయసు కలిగి ఉండాలి . చిన్నపిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది.
7) ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు.. కొండపైన రూమ్ దొరుకుతుందా ? రూమ్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి ?
జ) ఖచ్చితంగా దొరుకుతుంది.CRO ఆఫీస్ వద్ద క్యూలైన్లోకి వెళితే గదులు ఖాళీలు బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది. లేనిపక్షంలో యాత్రిసదన్ లో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.
8) వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా ?
జ) ఆఫ్లైన్ దర్శనం ఉండదు,3 నెలల ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
9) 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపై దొరుకుతాయా ?
జ) దొరకవు.3 నెలల ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
10) బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంత మంది దర్శనానికి వెళ్ళవచ్చు ?
జ) ఆరుగురు వెళ్లవచ్చు.
11) శ్రీవారి వాలంటరీ సేవా చేయాలంటే ముందుగా ఏం చేయాలి ?
జ) 15 మంది గ్రూపుగా ఏర్పడి ... ఆన్లైన్లో అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకు అర్హులు అవుతారు.
12) దర్శనం కోసం మీ సలహా ఏంటి ?
జ) ముందుగా ఆన్లైన్లో టికెట్లు , రూములు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది.
13) మా పిల్లలకు ఎన్ని సంవత్సరాలు దాటితే టిక్కెట్ తీయాలి ?
జ) 12 సంవత్సరాలు లోపు వారికి ఎటువంటి టిక్కెట్టు అవసరం లేదు... 12 సంవత్సరాల దాటితే కచ్చితంగా టికెట్ తీయాలి.
గమనిక : దర్శనం టికెట్లు , రూముల కోసం ఎవరన్నీ సంప్రదించి డబ్బులు పోగొట్టుకోకండి.
omnamovenkatesaya Govinda for more latest updates please please contact
TTD TOLL-FREE number,📱 155257 Govinda
🙏🙏🪷🪷
Tirumala Tirupati Devasthanams (TTD) contact details:
*Phone Numbers:*
- *Helpline:* 0877-2277777, 0877-2233333
- *Toll-Free (24/7 Call Centre):* 155257, 1800 425 4141, 1800 425 333 333
- *Public Relations Officer (PRO):* 0877-2264252, 0877-2263922
- *Accommodation Booking Enquiry:* 0877-2277777, 0877-2264252
- *JEO Office:* 0877-2263218, 0877-2263960 (Tirumala), 0877-2264231 (Tirupati)
- *Arjitham Office:* 08772-263589
*Email Addresses:*
- *General Queries:* helpdesk@tirumala.org
- *Refund Enquiries:* refundservices@tirumala.org, refundservices.ttd@tirumala.org
- *Executive Officer:* eottd@tirumala.org, eo@tirumala.org
- *Public Relations Officer:* pro@tirumala.org, contact@tirumala.org
- *JEO Office:* jeotml@tirumala.org, jeotpt@tirumala.org
- *Arjitham Office:* arjithamoffice@gmail.com
*WhatsApp Number:*
- 9399399399
*Address:*
- Tirumala Tirupati Devasthanams, TTD Administrative Building, K.T. Road, Tirupati 517501, Andhra Pradesh, India¹ ² ³
( శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరికి TTD సమాచారాన్ని షేర్ చేయగలరు )
ఓం నమో వెంకటేశాయ..🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :