🌸🙏 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం - 2025 🌸🙏
✨ అలంకార ప్రియుని సేవలో పుష్పమాలల మహిమ ✨
పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారు సుగంధ భరితమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరింపబడతారు. తిరువాయ్ మొళి వంటి ప్రాచీన గ్రంథాలలో కూడా ఈ పుష్పకైంకర్యం ప్రాముఖ్యత ప్రస్తావించబడింది.
ఇప్పుడు స్వామివారి ఆభరణాల స్థానంలో వినియోగించే విశిష్టమైన పూలమాలల వివరాలు చూద్దాం
🌼 పుష్పమాలల రకాలూ
1️⃣ శిఖామణి
కిరీటం మీదనుంచి రెండు భుజాలపైకి అలంకరించే ఎనిమిది మూరల దండ.
2️⃣ సాలిగ్రామ మాల
శ్రీవారి భుజాల నుండి పాదాల వరకు ఇరువైపులా వేలాడే రెండు పొడవైన పూలమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.
3️⃣ కంఠసరి
భుజాలపై పడే మూడున్నర మూరల దండ.
4️⃣ వక్షస్థల లక్ష్మి
శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
5️⃣ శంఖుచక్రం
శంఖం, చక్రాలకు ప్రత్యేకంగా రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.
6️⃣ కఠారిసరం
శ్రీస్వామివారి నందక ఖడ్గానికి అలంకరించే రెండు మూరల దండ.
7️⃣ తావళములు
నడుము నుండి మోకాళ్లపై, అలాగే పాదాల వరకు వేలాడే మూడు హారాలు:
మూడు మూరలు
మూడున్నర మూరలు
నాలుగు మూరలు
8️⃣ తిరువడి దండలు
శ్రీస్వామివారి పాదాల చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.
🌸 పూలంగి సేవ విశిష్టత
ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో స్వామివారి మూలమూర్తి నుంచి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న విశిష్ట పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు.
🌺 సువాసనలతో పరిమళించే ఈ పూలమాలలు స్వామివారి అలంకరణలో అద్భుత వైభవాన్ని ప్రసరింపజేస్తాయి.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :