🔔 *తిరుమల వైభవం* 🔔
✨🔔 బ్రహ్మోత్సవాలు ఎందుకంటే? 🔔✨
🌸 బ్రహ్మోత్సవాల మూలం
తిరుమల శ్రీవారి ఉత్సవాలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడని పురాణవచనం. అందుకే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అన్న పేరు వచ్చింది.
వర్ష ఋతువులో జరిగే కారణంగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. అన్నమయ్య కూడా ఈ ఉత్సవాల వైభవాన్ని వర్ణిస్తూ –
“నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి”
అని పాడాడు.
🌸 దీక్షతో వెళ్లే భక్తుడు
ఇల్లంతా బూజులు దులిపి పండుగకు సిద్ధమయ్యేలా,
శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు మనసులోని కల్మషాలు తొలగించుకోవాలి.
ఎదలను భక్తితో తడిపి, గుండెల్లో దైవాన్ని నిలిపి,
వేంకటేశ్వర దీక్షను స్వీకరించాలి.
ఇలా దీక్షితులై వెళ్లినప్పుడు –
కొండంత ఆనందం, అణువణువూ బ్రహ్మమయ అనుభూతి కలుగుతుంది.
అన్నమయ్య ఎందుకంటే –
“వేదములే శిలలై వెలసినది ఈ కొండ”
అని చెప్పాడు.
🌸 అనుభవ రహస్యం
గోపుర ప్రవేశ ద్వారం దాటినప్పుడే భక్తుని హృదయం తాకుతుంది.
ఆ ప్రవాహం కేవలం కాళ్లకే కాదు, జన్మజన్మల దోషాలను కడిగేస్తుంది.
అందుకే అన్నమయ్య గానమై పలికిన అనుభూతి,
సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమవుతుంది.
అప్పుడే భక్తునికి తెలుస్తుంది —
• దేహం మరణిస్తే అది నిర్యాణం.
• ‘నేను’ నశిస్తే అదే నిర్వాణం.
• నిర్వాణం చేరవేయు మార్గం బ్రహ్మానందం.
🌸 బ్రహ్మానందానికి దారితీసే ఉత్సవం
ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ కాదు.
మనసులోని అహంకారం, కాలుష్యం తొలగించి, పరమానందాన్ని రుచి చూపించే మార్గం.
అందుకే భూలోకంలో బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన ఈ మహోత్సవం,
భక్తులందరికీ నిర్వాణ సోపానమధిరోహణ అవుతుంది.
🙏 శ్రీవారి బ్రహ్మోత్సవాలు – భక్తి యాత్ర ముగింపు కాదు… కొత్త ఆధ్యాత్మిక యాత్ర మొదలు.
🔔 గోవిందా గోవిందా 🔔
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :