TirumalaHills
TirumalaHills

Social Icons

Pages

  • Free Rs.300 Tickets
  • Photo Competition
  • TTD Calendar
  • TTD Panchangam
  • Privacy Policy
  • Contact Us
ॐ Welcome to TirumalaHills - Dharmo Rakshati Rakshita - Govinda Govinda Govinda ॐ

Ads

Main Menu

  • Home
  • Tirumala History
    • Tirumala History
    • Darshan
    • Seva
    • Brahmotsavam
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Transportation
    • Free Meals / Anna Prasadam
    • Walking up the Hills
    • Kalyana Katta / Tonsuring
    • Medical Services
    • Tulabharam
    • Niluvudopidi
    • Anga Pradakshinam
  • Booking Services
    • Special Entry Darshan (Rs.300)
    • Free Sarva Darshanam
    • Seva at Tirumala
    • Seva at Tiruchanoor
    • Virtual Seva at Tirumala
    • Virtual Seva at Tiruchanoor
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Hundi @ Tirumala
    • Hundi @ Tiruchanoor
    • Srivani Trust Donations
    • Other Trust Donations
    • Cottage Donations
  • Festivals
    • Srivari Jyeshtabhishekam
    • Srivari Annual Salakatla Brahmotsavam
    • Srivari Annual Brahmotsavam
    • Srivari Navaratri Brahmotsavam
    • Srivari Annual Pavithrotsavam
  • Visiting Places
    • Srivari Pushkarini
    • Sri Bhu Varaha Swamy Temple
    • Kapila Theertham
    • Deer Park Reserve
    • Srivaari Paadamulu
    • Tirumala Museum
    • Silathoranam
    • Papavinasam Theertham
    • Srivari Mettu
    • Alipiri
    • Srinivasa Mangapuram
    • Tiruchanur – Alamelu Mangapuram
    • Matrusri Tarigonda Vengamamba
    • Kanipakam
    • Devuni Kadapa - Kadapa
  • Must Read
    • Most Popular Places
      • Ujjain Mahakaleshwar Jyotirlinga
      • Mahalakshmi Temple, Kolhapur
      • Sri Kanchi Kamakshi Amman Temple
      • Temple in Bhadrachalam
      • Maha Shivaratri
      • Srikalahasti Temple
      • VARANASI – Benares, Banaras or Kāśī
    • Popular Stotrams
      • SECRET HANUMAN RAKSHA MANTRA
      • SHIVA SAHASRA NAMA STOTRAM
      • SRI RUDRAM CHAMAKAM
      • SRI RUDRAM NAMAKAM
      • BILVAASHTAKAM
      • LINGASHTAKAM
      • SHIVASHTAKAM
      • SRI RUDRAM LAGHUNYASAM
      • SRI VENKATESWARA GOVINDA NAMALU
    • Route Map
    • Today Telugu Panchangam
    • Indian Festivals
    • Top Secret Facts of Lord Venkateswara
    • 300 Year Old Tirumala Laddu
    • Sri Venkateswara Suprabhatam
    • Sri Venkateswara Stotram
    • Sri Venkateswara Prapatti
    • Sri Venkatesha Mangalaasaasanam
    • Venkateswara Ashtottara Sata Namavali
    • Govinda Namaavali
    • Sri Srinivasa Gadyam
    • Sri Venkateswara Vajra Kavacha Stotram
  • Keerthanalu
    • Sri Tallapaka Annamacharya
    • Annamayya Keerthanas Part-1
      • Kattedura Vaikuntham
      • Musina Mutyalakele
      • Tiruveedhula Merasi
      • Vinaro Bhagyamu
      • Narayanathe Namo Namo
      • Anni Mantramulu
      • Chandamama Raavo
      • Indariki Abhayambu
      • Adivo Alladivo
      • Tandanana Ahi
      • Manujudai Putti
      • Ekkuva Kulajudaina
      • Kondalalo Nelakonna
      • Shodasa Kalanidhiki
      • Jo Achyutananda
      • Jagadapu Chanuvula
      • Enta Matramuna
      • Brahma Kadigina Padamu
      • Nanati Bathuku
      • Bhavayami Gopalabalam
    • Annamayya Keerthanas Part-2
      • Alara Chanchalamaina
      • Alarulu Kuriyaga
      • Ammamma Emamma
      • Andariki Aadhaaramaina
      • Antaryami Alasiti
      • Ati Dushtuda Ne Nalusudanu
      • Bhaavamu Lona
      • Chaaladaa Brahmamidi
      • Chaaladaa Hari Naama
      • Chaduvulone Harina
      • Chakkani Talliki
      • Cheri Yasodaku
      • Choodaramma Satulaaraa
      • Daachuko Nee Paadaalaku
      • Dasaratha Raamaa
      • Deva Devam Bhaje
      • Deva Ee Tagavu Teerchavayyaa
      • Dolaayaanchala
      • E Puraanamula Nenta Vedikinaa
      • Ee Suralu Ee Munulu
      • Ele Ele Maradalaa

Tirumala Alipiri అలిపిరి మార్గం ❤💕

Post a Comment Wednesday, June 22, 2022



*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*

🌈 *అలిపిరి మార్గం*

💫 తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న రెండు మార్గాలలో, భక్తులు అధికంగా వెళ్ళేది *అలిపిరి* మార్గంలోనే. తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 3550 మెట్లు కలిగి ఉంటుంది. *"శ్రీవారిమెట్లు"* మార్గంతో పోల్చితే, అలిపిరి మార్గంలో వెయ్యికి పైగా మెట్లు ఎక్కువ. దూరం కూడా అధికమే! అయినా, తిరుపతి పట్టణానికి అతి చేరువలోనుండటం, దారి పొడవునా అనేక రసరమ్య భరిత ప్రకృతి దృశ్యాలు చారిత్రక విశేషాలు ఉండటం, మధ్యమధ్యలో మెట్లు ఎక్కే అవసరం లేకుండా చాలా భాగం నడకదారి ఉండి అలసట తక్కువగా అనిపించడం; వంటి కారణాల వల్ల ఈ మార్గం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.

🌈 *సులభతరమైన సోపానాలు*

💫 గ్రానైట్ దిమ్మలతో చేయబడి, మెట్లన్నీ దాదాపు తొమ్మిదంగుళాల ఎత్తు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటాయి. ప్రతి ఐదారు మెట్లకు నాలుగైదు అడుగుల వెడల్పు కలిగిన ఒక పెద్ద మెట్టు ఉండటంతో, అలసట తక్కువగా అనిపిస్తుంది. మెట్లన్నీ దాదాపు 12 అడుగుల పొడవుంటాయి. దారి మధ్యన ఉన్న స్టెయిన్లెస్ స్టీల్‌రైలింగ్ మెట్లెక్కే వారికి ఊతంగా పనిచేస్తుంది. బాటకు ఇరువైపులా కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా, రెండడుగుల మందం కలిగిన సిమెంటు అరుగులు ఉంటాయి. ప్రతి యాభయ్యవ మెట్టు మధ్యభాగంలో, ఆ మెట్టు యొక్క సంఖ్య చెక్కబడి ఉంటుంది. అలాగే, ప్రతి రెండు-మూడొందల మెట్లకూ, బాటకు ప్రక్కగా; మనం ఎక్కేసిన మెట్లు, ఇంకా ఎక్కవలసిన మెట్లను సూచించే బోర్డులు ఉంటాయి. ఒక్కో బోర్డు చూడగానే, ఒక్కో రాజ్యాన్ని జయించినంత సంబరం కలిగి, తాజా ఉత్సాహాన్ని పుంజుకుంటాం. దాదాపు మార్గమంతా సిమెంట్ రేకులు, కాంక్రీట్ పైకప్పుతో యాత్రికులకు ఎండావానల నుండి రక్షణగా ఉంటుంది. మార్గం పొడవునా తినుబండారాల అంగళ్ళు, మంచినీటి ఏర్పాట్లు, శౌచాలయాలు ఉండటంతో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగదు. కాంక్రీట్ కప్పును నిలబెట్టే సిమెంట్ స్తంభాలన్నింటిపై గోవిందనామాలు వ్రాయబడి భక్తిభావాన్ని ఇనుమడింపజేస్తాయి. అలాగే సగం మార్గం దాటిన తరువాత బాటకు ప్రక్కగా, గోడలపై విష్ణుసహస్రనామాలు చెక్కబడిన గ్రానైట్ పలకలు అమర్చబడి ఉన్నాయి. మరి కొంత దూరం తరువాత కనకధారా స్తవం కూడా చెక్కబడి ఉంది.

💫 దాదాపుగా మార్గమధ్యలో కానవచ్చే 30 అడుగుల ఆంజనేయుని ప్రతిమ వరకూ, సుమారు ప్రతి 200 మెట్లకు ఒకటి చొప్పున దశావతార విగ్రహాలు మత్స్యావతారం మొదలుకొని కల్క్యావతారం వరకు ఈ మధ్యనే ప్రతిష్ఠింపబడ్డాయి. ఆ తరువాత, దాదాపు ప్రతి నూరు మెట్లకు ఒకటి చొప్పున విష్ణుభక్తిలో మునిగి తేలిన పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి.





🌈 *ప్రకృతిసోయగం*

💫 దట్టమైన అడవులతో కూడుకున్న ఈ పర్వతమార్గం ముగ్ధమనోహరమైన ప్రాకృతిక దృశ్యాలకు ఆలవాలం. మార్గానికి ఇరు ప్రక్కలా పచ్చటి తివాచీ పరచినట్లుంటుంది. అల్లంతదూరంలో ఉన్న లోయలకావల పచ్చదనం అంతగా లేకుండా నునుపుగా కనుపించే బండరాతి పర్వతశిఖరాలపై ప్రతిబింబించే సూర్యకాంతి, తెల్లని మంచుతో కప్పబడి ఉన్న హిమవత్పర్వత శిఖరాల శోభను తలపిస్తుంది. శేషాచల అడవుల్లో విరివిగా పెరిగే ఔషధ మొక్కల పైనుండి వీచే పిల్లతెమ్మెరలు స్వేదంతో కూడిన శరీరంపై మెల్లమెల్లగా వీస్తుంటే, అలసట అటకెక్కి పోతుంది. దట్టమైన వృక్షాల ఆకుల మధ్యభాగం లోని సన్నని రంధ్రాల ద్వారా చొచ్చుకు వస్తున్న సూర్యకిరణాలు, జోరువానలో ఏటవాలుగా కురిసే వాడి అయిన వర్షపు జల్లులను తలపిస్తాయి. వర్షరుతువులో అయితే, లెక్కకు మిక్కిలిగా ఉన్న చిన్నా-పెద్దా జలపాతాలు, పిల్లకాలువలు కూడా కనువిందు చేస్తాయి.

💫 అక్కడక్కడా హోరుగాలుల అలజడి, దూరంగా పారుతున్న నీటి ఒరవడి, ఎండుటాకుల సవ్వడి, పక్షుల కిలకిలారావాలు, గండుతుమ్మెదల ఝంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, పర్వతసానువుల్లో ప్రతధ్వనిస్తూ లౌడ్ స్పీకర్ల ద్వారా దాదాపు మార్గమంతా వినవచ్చే అన్నమయ్య కీర్తనలు కలగలిసి పోయి భక్తులకు అనిర్వచనీయమైన, ఆధ్యాత్మికతత్వంతో కూడిన శ్రవణానందం కలుగజేస్తాయి.

💫 దాదాపు రెండువేల మెట్లు ఎక్కేంత వరకూ తిరుపతి పట్టణం శోభాయమానంగా దర్శనమిస్తుంది. పట్టణం లోని పెక్కు అంతస్తుల దివ్య హర్మ్యాలు అగ్గిపెట్టెలె వలె గోచరిస్తాయి.

🌈‌ *వృక్ష - జంతుజాలాలు* 

💫 శేషాచల పర్వతాలు జీవవైవిధ్యానికి ఆటపట్లు. ఈ దట్టమైన అడవుల్లో దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు, ఈ దక్షిణ భారతదేశంలోనే అత్యధికమైన జంతు జాతులు నివసించేవి. అయితే జనసాంద్రత పెరగడంతోనూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోవడం వల్లనూ; జంతుజాతులు అంతరించి పోతున్నాయి. ఇప్పుడు మనకు సాధారణంగా కనుపించే వన్యప్రాణులలో పిల్ల కోతిని కడుపుకు కరచుకొని, జంకు గొంకు లేకుండా చెంగుఛెంగున గంతులేసే వానరాలు; నల్లటి ముఖాలు, పొడపాటి తోకలు కలగి, చెట్లకొమ్మలపై నుండి చోద్యం చూస్తున్న కొండముచ్చులు; చారెడేసి కళ్ళు, వంకర్లు తిరిగిన కొమ్ములతో బిరబిరా పరుగులు తీసే లేళ్లు; ఆహారం కోసం అర్రులు చాస్తూ, అమాయకత్వం పోతపోసినట్లుండే నేత్రాలతో ఉన్న దుప్పులు; అత్యంత అరుదుగా కలుగుల్లోకి ఆతృతగా పరుగులు తీసే సరీనృపాలు; చిరు కోరలతో చిర్రుబుర్రులాడుతున్న అడవిపందులు; రంగు రంగుల సీతాకోక చిలుకలు; మార్గమంతా సందడి చేసే అడవి పిచ్చుకలు; పరుగులలో పోటీపడుతున్న ఉడుతలు; ముదురు గోధుమరంగుతో ఉన్న పొడవాటి శరీరం కలిగి, చెట్ల కొమ్మల అంచులలో సయ్యాట లాడుతున్న బెట్లుడుతలు ముఖ్యమైనవి. 

💫‌ అటవీశాఖ సిబ్బంది కళ్ళు కప్పి - చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు కూడా చాలా అరుదుగా, మెట్ల మార్గంపై సందడి చేస్తుంటాయి. అయితే అనుభవం, నైపుణ్యం కలిగిన అటవీశాఖ సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలతో ఇంతవరకు ప్రాణనష్టం జరిగిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి!

💫‌అలాగే, అసంఖ్యాకమైన వృక్షజాతులకు కూడా సప్తగిరులు ఆలవాలాలు. ఈ మార్గంలో కనిపించే వాటిలో – వేప, మద్ది, రావి, జువ్వి, మర్రి, తంగేడు, దేవదారు, అశోక, బ్రహ్మజెముడు, తుమ్మ మొదలైన వృక్షరాజాలు; పున్నాగ, కదంబ, మోదుగ, గన్నేరు, సంపంగి, చామంతి, మందార, జాజి, గులాబి మొదలైన పూలచెట్లూ; సీతాఫలం, మామిడి, జామ, సపోటా, మునగ, పనస మొదలగు ఫలవృక్షాలు; వృక్షకాండాలకు చుట్టుకొని ఉన్న మాలతీ లతలు, సన్నజాజి తీగెలు – ముఖ్యమైనవి. వీటిలో అడవులలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలతో పాటు, ఉద్యానవన శాఖ సిబ్బంది శ్రద్ధగా పెంచే పలురకాల ఫల, పుష్ప జాతులు కూడా మిళితమై ఉన్నాయి.



*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


🌈 *అలిపిరి అంటే?* 🌈

💫 తిరుమలకు మెట్లదారి మరియు కొండపైకి వాహనాలు వెళ్ళే ఘాట్ రోడ్డు, రెండూ ఒకే ప్రదేశంలో, అంజలి ఘటిస్తూ సమున్నతంగా నిల్చొని ఉన్న గరుత్మంతుని విగ్రహం వద్ద ఆరంభ మవుతాయి. ఆ ప్రదేశాన్నే *"అలిపిరి"* గా పిలుస్తారు. దానికా పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి -

🌻👉 *"ఆదిపడి"* అనే తమిళ పదబంధంలో - "ఆది" అనే పదానికి "మొట్టమొదట" అని, "పడి" అనే పదానికి "గట్టు" లేదా "ద్వారము" అని అర్థం. తిరుమల కొండకు చేరుకునే మొట్టమొదటి "మెట్టు" ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి *"ఆదిపడి"* అనే నామం ఏర్పడి, అదే కాలక్రమంలో *"అలిపిరి"* గా ఆంద్రీకరించబడింది.

🌻👉 మరో కథనం ప్రకారం, తిరుమలకు ఉన్నట్లుగా చెప్పబడే అనేక మార్గాల్లో, చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకూ, ఇదే ప్రప్రథమ మార్గం. అందువల్లనే దీనిని "ఆదిపడి" లేదా "అలిపిరి" అని పిలుస్తారు.

🌻👉 ఈ ప్రదేశంలో, శ్రీవైష్ణవులు పరమ పవిత్రంగా భావించే, శాఖోపశాఖలు కలిగిన "చింతచెట్టు" ఉండేది. చింతచెట్టు తొర్రలో నుండే తమిళుల ఆరాధ్య దైవమైన నమ్మాళ్వారుల వారు ఉపదేశం చేశారని ప్రతీతి. తమిళంలో – చింతచెట్టును "పులి" గానూ (చింతపండుతో చేసే పులి హోరను గుర్తుకు తెచ్చుకుందాం!), పర్వతపాదాన్ని "అడివారం" గానూ వ్యవహరిస్తారు. అందువల్ల, పర్వత ప్రారంభంలో ఉండే ఈ చింతచెట్టును "అడివారపు పులి", లేదా "అడిపులి" గా పిలిచేవారు. అదే, కాలక్రమాన "అలిపిరి" గా రుపాంతరం చెందింది.

🌻👉 "అలిపిరి" అంటే, "సూక్ష్మరూపం కలిగిన" అనే మరో అర్థం వస్తుంది. ఇక్కడ శ్రీనివాసుడు "సూక్ష్మరూప ధారి" గా కొలువై ఉంటాడనే నమ్మకం ఉండటం చేత, ఆ ప్రదేశానికి "అలిపిరి" అనే పేరు వచ్చింది.

✅ శ్రీవెంకటేశ్వరుని మహిమను సాక్షాత్కరింప జేసే మరో అద్భుతమైన, చారిత్రాత్మక కథనం కూడా ఉంది. అదేంటంటే.




🌈 *నాటి "అలీఫిరే!" నే -  ఈనాటి అలిపిరి* 🌈

💫 'అలిపిరి' కి ఆ పేరు రావడం వెనుక, ఒక అజ్ఞాతభక్తుడు విరచించిన *"వేంకటాచల విహారశతకము"* అనే గ్రంథంలో మరో కథనం కూడా ఉంది. దాని ప్రకారం.....

💫 పదిహేడవ శతాబ్దం ద్వితీయార్థంలో, ఢిల్లీలో మొఘలు చక్రవర్తుల పరిపాలన నడుస్తోంది. దక్షిణాన శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసితంగడి, తళ్ళికోట యుద్ధాల తరువాత విజయనగర రాజుల ప్రాబల్యం క్షీణించడంతో; మొఘలు చక్రవర్తులకు సామంతునిగా ఉన్న నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించి, హిందూ దేవాలయాలపై అత్యాచారాలు చేయసాగాడు. 

💫 ఆ శతాబ్దపు చివరి దశకంలో, ఢిల్లీకి ఆజ్ఞాబద్ధుడైన నిజాంనవాబు "అలీ" అనబడే కరుడుగట్టిన మహమ్మదీయ ఛాందసవాది ఆధ్వర్యంలో తన అపరిమిత సైన్యాన్ని తిరుమల దేవాలయంపై దండయాత్రకు పంపాడు. హైందవమతానికి ఆయువుపట్టైన శ్రీవేంకటేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేయండా ద్వారా హిందూమతాన్ని నిర్వీర్యం గావించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడమే గాకుండా; అంతకు ముందు శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి సమర్పించిన అమూల్య ఆభరణాలను తస్కరించటం కూడా ఈ దండయాత్ర లక్ష్యం. నవాబు ఆదేశం మేరకు తిరుపతి చేరుకున్న అలీ సైన్యానికి పట్టణ ప్రజలందరూ ఎదురై తమ ఊరిలోని స్త్రీలందరి వద్దనున్న బంగారు ఆభరణాలు స్వీకరించి తిరిగి వెళ్ళిపొమ్మని, స్వామివారి జోలికి వెళ్లవద్దని అభ్యర్థించారు. తాళిబొట్లతో సహా గ్రామస్తుల అందరి ఆభరణాలను చేజిక్కించుకున్నా, విశ్వాసఘాతకుడైన "అలీ" ఒప్పందాన్ని ధిక్కరించి, ముందుగా రచించుకొన్న పథకం ప్రకారం తిరుమలపై దండయాత్రకు ఉపక్రమించాడు. 

💫 శేషాచల పర్వతపాదం వద్ద, అంటే సరిగ్గా ఇప్పుడు "అలిపిరి" గా పిలువబడే ప్రాంతంలో, అలీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వరాహరూపంలో సాక్షాత్కరించిన స్వామివారు అలీ సైన్యాన్ని నిలువరించారు. అయినా ఆ ముష్కరులు వెనుకకు తగ్గకపోవడంతో, శ్రీవారి ఆగ్రహం వల్ల "అలీ" దృష్టివిహీను డయ్యాడు. గాఢాంధకారంలో అలమటిస్తూ, దిక్కుతోచక విలపిస్తున్న అలీకి తక్షణమే వెనుదిరిగ వలసిందిగా స్వామివారి హెచ్చరిక వినబడింది. కనువిప్పు కలిగిన అలీ వెంటనే శ్రీవారిని క్షమాభిక్ష నర్థించి నేత్రదానం చేయమని వేడుకొన్నాడు. శాంతించిన స్వామివారి ఆదేశానుసారం అక్కడి నుండి "బతుకు జీవుడా!" అనుకుంటూ అలీ నిష్క్రమించడంతో – అక్కడున్న సిపాయి లందరూ, మహమ్మదీయ మతస్తులతో సహా, అంతులేని ఉద్వేగానికి లోనై, "అలీ ఫిరే!" అంటూ నినాదాలు చేశారు. ఈ ఉత్తరభారత పదబంధానికి "అలీ తోక ముడిచాడు" అని అర్థం. ఈ ఉదంతాన్ని పరిసర ప్రాంతాలలోని సంస్థానాధీశు లందరూ సంబరంగా జరుపుకుని, "అలీ ఫిరే!" అంటూ దండోరా వేయించారు. సాక్షాత్తు స్వామివారు సాక్షాత్కరించిన ఆ ప్రాంతానికి, తండోప తండాలుగా భక్తులు తీర్థయాత్రకు తరలి వెళ్ళేవారు. "అలి ఫిరే!" అన్న నానుడి తదనంతర కాలంలో ఆంద్రీకరించబడి, "అలిపిరి" గా స్థిరమైంది. ఎలా వచ్చినప్పటకీ, వినసొంపైన "అలిపిరి" పేరు వినగానే ముప్పిరిగొనే ఆధ్యాత్మిక భావోద్వేగంతో మనసు తనువు
పులకరించి పోతాయి.



*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*

🌈 *అలిపిరి మార్గం*

💫 తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న రెండు మార్గాలలో, భక్తులు అధికంగా వెళ్ళేది *అలిపిరి* మార్గంలోనే. తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం 3550 మెట్లు కలిగి ఉంటుంది. *"శ్రీవారిమెట్లు"* మార్గంతో పోల్చితే, అలిపిరి మార్గంలో వెయ్యికి పైగా మెట్లు ఎక్కువ. దూరం కూడా అధికమే! అయినా, తిరుపతి పట్టణానికి అతి చేరువలోనుండటం, దారి పొడవునా అనేక రసరమ్య భరిత ప్రకృతి దృశ్యాలు చారిత్రక విశేషాలు ఉండటం, మధ్యమధ్యలో మెట్లు ఎక్కే అవసరం లేకుండా చాలా భాగం నడకదారి ఉండి అలసట తక్కువగా అనిపించడం; వంటి కారణాల వల్ల ఈ మార్గం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.

🌈 *సులభతరమైన సోపానాలు*

💫 గ్రానైట్ దిమ్మలతో చేయబడి, మెట్లన్నీ దాదాపు తొమ్మిదంగుళాల ఎత్తు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటాయి. ప్రతి ఐదారు మెట్లకు నాలుగైదు అడుగుల వెడల్పు కలిగిన ఒక పెద్ద మెట్టు ఉండటంతో, అలసట తక్కువగా అనిపిస్తుంది. మెట్లన్నీ దాదాపు 12 అడుగుల పొడవుంటాయి. దారి మధ్యన ఉన్న స్టెయిన్లెస్ స్టీల్‌రైలింగ్ మెట్లెక్కే వారికి ఊతంగా పనిచేస్తుంది. బాటకు ఇరువైపులా కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా, రెండడుగుల మందం కలిగిన సిమెంటు అరుగులు ఉంటాయి. ప్రతి యాభయ్యవ మెట్టు మధ్యభాగంలో, ఆ మెట్టు యొక్క సంఖ్య చెక్కబడి ఉంటుంది. అలాగే, ప్రతి రెండు-మూడొందల మెట్లకూ, బాటకు ప్రక్కగా; మనం ఎక్కేసిన మెట్లు, ఇంకా ఎక్కవలసిన మెట్లను సూచించే బోర్డులు ఉంటాయి. ఒక్కో బోర్డు చూడగానే, ఒక్కో రాజ్యాన్ని జయించినంత సంబరం కలిగి, తాజా ఉత్సాహాన్ని పుంజుకుంటాం. దాదాపు మార్గమంతా సిమెంట్ రేకులు, కాంక్రీట్ పైకప్పుతో యాత్రికులకు ఎండావానల నుండి రక్షణగా ఉంటుంది. మార్గం పొడవునా తినుబండారాల అంగళ్ళు, మంచినీటి ఏర్పాట్లు, శౌచాలయాలు ఉండటంతో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగదు. కాంక్రీట్ కప్పును నిలబెట్టే సిమెంట్ స్తంభాలన్నింటిపై గోవిందనామాలు వ్రాయబడి భక్తిభావాన్ని ఇనుమడింపజేస్తాయి. అలాగే సగం మార్గం దాటిన తరువాత బాటకు ప్రక్కగా, గోడలపై విష్ణుసహస్రనామాలు చెక్కబడిన గ్రానైట్ పలకలు అమర్చబడి ఉన్నాయి. మరి కొంత దూరం తరువాత కనకధారా స్తవం కూడా చెక్కబడి ఉంది.

💫 దాదాపుగా మార్గమధ్యలో కానవచ్చే 30 అడుగుల ఆంజనేయుని ప్రతిమ వరకూ, సుమారు ప్రతి 200 మెట్లకు ఒకటి చొప్పున దశావతార విగ్రహాలు మత్స్యావతారం మొదలుకొని కల్క్యావతారం వరకు ఈ మధ్యనే ప్రతిష్ఠింపబడ్డాయి. ఆ తరువాత, దాదాపు ప్రతి నూరు మెట్లకు ఒకటి చొప్పున విష్ణుభక్తిలో మునిగి తేలిన పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి.


🌈 *ప్రకృతిసోయగం*

💫 దట్టమైన అడవులతో కూడుకున్న ఈ పర్వతమార్గం ముగ్ధమనోహరమైన ప్రాకృతిక దృశ్యాలకు ఆలవాలం. మార్గానికి ఇరు ప్రక్కలా పచ్చటి తివాచీ పరచినట్లుంటుంది. అల్లంతదూరంలో ఉన్న లోయలకావల పచ్చదనం అంతగా లేకుండా నునుపుగా కనుపించే బండరాతి పర్వతశిఖరాలపై ప్రతిబింబించే సూర్యకాంతి, తెల్లని మంచుతో కప్పబడి ఉన్న హిమవత్పర్వత శిఖరాల శోభను తలపిస్తుంది. శేషాచల అడవుల్లో విరివిగా పెరిగే ఔషధ మొక్కల పైనుండి వీచే పిల్లతెమ్మెరలు స్వేదంతో కూడిన శరీరంపై మెల్లమెల్లగా వీస్తుంటే, అలసట అటకెక్కి పోతుంది. దట్టమైన వృక్షాల ఆకుల మధ్యభాగం లోని సన్నని రంధ్రాల ద్వారా చొచ్చుకు వస్తున్న సూర్యకిరణాలు, జోరువానలో ఏటవాలుగా కురిసే వాడి అయిన వర్షపు జల్లులను తలపిస్తాయి. వర్షరుతువులో అయితే, లెక్కకు మిక్కిలిగా ఉన్న చిన్నా-పెద్దా జలపాతాలు, పిల్లకాలువలు కూడా కనువిందు చేస్తాయి.

💫 అక్కడక్కడా హోరుగాలుల అలజడి, దూరంగా పారుతున్న నీటి ఒరవడి, ఎండుటాకుల సవ్వడి, పక్షుల కిలకిలారావాలు, గండుతుమ్మెదల ఝంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, పర్వతసానువుల్లో ప్రతధ్వనిస్తూ లౌడ్ స్పీకర్ల ద్వారా దాదాపు మార్గమంతా వినవచ్చే అన్నమయ్య కీర్తనలు కలగలిసి పోయి భక్తులకు అనిర్వచనీయమైన, ఆధ్యాత్మికతత్వంతో కూడిన శ్రవణానందం కలుగజేస్తాయి.

💫 దాదాపు రెండువేల మెట్లు ఎక్కేంత వరకూ తిరుపతి పట్టణం శోభాయమానంగా దర్శనమిస్తుంది. పట్టణం లోని పెక్కు అంతస్తుల దివ్య హర్మ్యాలు అగ్గిపెట్టెలె వలె గోచరిస్తాయి.

🌈‌ *వృక్ష - జంతుజాలాలు* 

💫 శేషాచల పర్వతాలు జీవవైవిధ్యానికి ఆటపట్లు. ఈ దట్టమైన అడవుల్లో దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు, ఈ దక్షిణ భారతదేశంలోనే అత్యధికమైన జంతు జాతులు నివసించేవి. అయితే జనసాంద్రత పెరగడంతోనూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోవడం వల్లనూ; జంతుజాతులు అంతరించి పోతున్నాయి. ఇప్పుడు మనకు సాధారణంగా కనుపించే వన్యప్రాణులలో పిల్ల కోతిని కడుపుకు కరచుకొని, జంకు గొంకు లేకుండా చెంగుఛెంగున గంతులేసే వానరాలు; నల్లటి ముఖాలు, పొడపాటి తోకలు కలగి, చెట్లకొమ్మలపై నుండి చోద్యం చూస్తున్న కొండముచ్చులు; చారెడేసి కళ్ళు, వంకర్లు తిరిగిన కొమ్ములతో బిరబిరా పరుగులు తీసే లేళ్లు; ఆహారం కోసం అర్రులు చాస్తూ, అమాయకత్వం పోతపోసినట్లుండే నేత్రాలతో ఉన్న దుప్పులు; అత్యంత అరుదుగా కలుగుల్లోకి ఆతృతగా పరుగులు తీసే సరీనృపాలు; చిరు కోరలతో చిర్రుబుర్రులాడుతున్న అడవిపందులు; రంగు రంగుల సీతాకోక చిలుకలు; మార్గమంతా సందడి చేసే అడవి పిచ్చుకలు; పరుగులలో పోటీపడుతున్న ఉడుతలు; ముదురు గోధుమరంగుతో ఉన్న పొడవాటి శరీరం కలిగి, చెట్ల కొమ్మల అంచులలో సయ్యాట లాడుతున్న బెట్లుడుతలు ముఖ్యమైనవి. 

💫‌ అటవీశాఖ సిబ్బంది కళ్ళు కప్పి - చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు కూడా చాలా అరుదుగా, మెట్ల మార్గంపై సందడి చేస్తుంటాయి. అయితే అనుభవం, నైపుణ్యం కలిగిన అటవీశాఖ సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలతో ఇంతవరకు ప్రాణనష్టం జరిగిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి!

💫‌అలాగే, అసంఖ్యాకమైన వృక్షజాతులకు కూడా సప్తగిరులు ఆలవాలాలు. ఈ మార్గంలో కనిపించే వాటిలో – వేప, మద్ది, రావి, జువ్వి, మర్రి, తంగేడు, దేవదారు, అశోక, బ్రహ్మజెముడు, తుమ్మ మొదలైన వృక్షరాజాలు; పున్నాగ, కదంబ, మోదుగ, గన్నేరు, సంపంగి, చామంతి, మందార, జాజి, గులాబి మొదలైన పూలచెట్లూ; సీతాఫలం, మామిడి, జామ, సపోటా, మునగ, పనస మొదలగు ఫలవృక్షాలు; వృక్షకాండాలకు చుట్టుకొని ఉన్న మాలతీ లతలు, సన్నజాజి తీగెలు – ముఖ్యమైనవి. వీటిలో అడవులలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలతో పాటు, ఉద్యానవన శాఖ సిబ్బంది శ్రద్ధగా పెంచే పలురకాల ఫల, పుష్ప జాతులు కూడా మిళితమై ఉన్నాయి.




*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"

🙏 *లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం* 🙏

💫 సరిగ్గా శ్రీవారి పాదమండపానికి ఎదురుగా, 16 వ శతాబ్దంలో శ్రీ నరసింహరాయల వారిచే నిర్మితమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించు కోవచ్చు. ఈ ఆలయాన్ని అన్నమాచార్యుల వారు *"అలగిరి సింగని"* ఆలయంగా వర్ణించాడు. దానిని బట్టి ఒకప్పుడు ఇది "లక్ష్మీ నరసింహస్వామి" ఆలయమని, ఏవో తెలియని కారణాల వల్ల ఇది లక్ష్మీ నారాయణస్వామి ఆలయంగా పరిణామం చెందిందని చెబుతారు. ఏది ఏమైనా, నారాయణుడు-నారసింహుడు ఇద్దరూ అభిన్నులు. స్వామివారిని ఏ రూపంలో సేవించుకున్నా ముక్తి మార్గం లభిస్తుంది.

🌈 *మాలదాసరి* 🌈

💫 పై రెండు ఆలయాల నడుమన ఉన్న కాలిబాటలో ముందుకు సాగితే, కొద్ది దూరంలో, రహదారి మధ్యగా సాష్టాంగ నమస్కారం చేస్తున్న శ్రీవారి మహాభక్తుడు *"మాలదాసరి"* శిలావిగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహానికి పూలమాలలు వేసి, పూజలు చేసి ముందుకు సాగుతారు. ఈ విగ్రహం ప్రక్కనే, రాతిపలకపై చెక్కబడి ఉన్న మరో ముగ్గురు భక్తుల విగ్రహాలు కూడా కానవస్తాయి. బహుశా వీరు మాలదాసరి కుటుంబ సభ్యులు కావచ్చు. హరిజనునిగా జన్మించి, వైష్ణవ సాంప్రదాయం అవలంభించి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు ఈ మాలదాసరి! ఈతని చరిత్రను శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్యమాల్యద" లో గ్రంథస్థం కావించాడు.

💫 తరువాతి కాలంలో, మాలదాసరిని అనుసరించి ఎందరో హరిజనులు వైష్ణవం లోకి ప్రవేశించారు. ఈ దాసుల గురించి "దాస సాహిత్య ప్రాజెక్టు" అనే ప్రకరణంలో మున్ముందు తెలుసుకుందాం.

🌈 *అలిపిరి మార్గం - చారిత్రక నేపథ్యం* 🌈

💫 ఈ మార్గాన్ని 17వ శతాబ్దపు ప్రథమార్థంలో "మట్ల కుమార అనంతరాజు" నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. పలువురికీ ఉపయోగకరమైన, కష్టసాధ్యమైన మెట్లదారి నిర్మించడంతో ఈయన "మెట్లకుమార" గా, తదనంతర కాలంలో "మట్ల కుమార" గా ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు. మరో కథనం ప్రకారం, ఈ మహారాజు, ఆ సమయంలో రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన 'మల్లీ' వంశస్తుడు కావడం చేత 'మట్ల కుమారుని' గా ప్రసిద్ధి గాంచాడు.

💫 'అలిపిరి" నుండి, మార్గమధ్యంలో నుండే 'గాలిగోపురం' వరకు ఉన్న మెట్ల మార్గాన్ని మాత్రమే ఈ రాజు నిర్మించాడు. ఈ మార్గం గాలిగోపురం నుండి కొండపై వరకు అంతకు ముందే ఉన్నట్టి సోపానమార్గంలో కలిసిపోతుంది. తత్పూర్వం, కపిలతీర్థం నుంచి వచ్చే మరో సోపానమార్గం, గాలిగోపురం ద్వారా తిరుమల కొండకు చేరుకునేది. అనంతరాజు కట్టించిన అలిపిరి నుండి గాలిగోపురం చేరుకునే మార్గం దగ్గరగా ఉండటంతో, ఇదే ప్రాచుర్యం పొంది, కాలక్రమేణా గాలిగోపురం నుండి కపిలేశ్వర ఆలయానికి వెళ్లే సోపానమార్గం శిథిలమై పోయింది.

💫 మాలదాసరికి నమస్కరించుకుని ఏడెనిమిది మెట్లెక్కగానే మనకు ఏడు అంతస్తులు, ఎనిమిది ద్వారబంధాలతో కూడుకున్న, సమున్నతమైన *"రాజగోపురం",* లేదా *"మహాద్వార గోపురం",* లేదా *"ప్రథమ గోపురం"* కనబడుతుంది. ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజైన నరసింహరాజు నిర్మించారు. 1928వ సంవత్సరంలో దీనిపై పిడుగు పడి, ద్వారమండపం మాత్రం మిగిలి, గోపురమంతా ధ్వంసమై పోయింది. ఆ కారణంగా స్థానికులు దీనిని *"మొండిగోపురం"* గా పిలుస్తారు. 1982వ సంవత్సరంలో తి.తి.దే. వారు చారిత్రక ఆనవాళ్లకు భంగం కలగని రీతిలో ఈ గోపురాన్ని పునరుద్ధరించారు. సమున్నతంగా, సర్వాంగసుందరంగా గోచరించే ఈ గోపురశోభకు అచ్చెరువొందుతూ, అలనాటి శిల్పకళాకారులకు జేజేలు పలుకుతూ ముందుకు సాగుదాం.

🌈 *తలయేరు గుండు* 🌈

💫 రాజగోపుర ద్వారం గుండా మరి కొన్ని మెట్లు ఎక్కగానే, 48వ మెట్టు వద్ద మనకు కుడిప్రక్కగా *"తలయేరు గుండు"* దర్శనమిస్తుంది. అలిపిరి మార్గం పొడవునా కనిపించే గుండ్రటి శిలలలో మొదటిది, మరియు అత్యంత పెద్దది అయినందువల్లా; ఆ బండరాతి ప్రక్కనే ఇదివరకు ఒక ఏరు ప్రవహిస్తుండటం వల్ల ఇది *"తలయేరు గుండు"* గా స్థిరపడింది. తమిళంలో "తలై" అంటే 'మొదటిది' లేదా 'ముఖ్యమైనది' అని అర్థం. యాత్రికులు మెట్లెక్కే టప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటం కోసం అనాదిగా వస్తున్న ఆచారాన్న నుసరించి వందల సంవత్సరాలుగా తమ మోకాళ్లను ఆన్చటం వల్ల అరుగుదలతో, బండరాతి క్రింద భాగంలో మోకాటి చిప్పలను పోలే అనేక గుంతలు కనిపిస్తాయి. ఈ శిలకు పైభాగంలో, అంజలి ఘటిస్తున్న ఆంజనేయుణ్ణి దర్శించుకోవచ్చు. సాక్షాత్తు ఆంజనేయుని శిల్పాంకితమైన శిల యొక్క పవిత్రతను పరిరక్షించడానికి, ఈ అమూల్యమైన వారసత్వ సంపదను కాపాడు కోవటానికి ఆ పవిత్రశిలను మోకాటితో తాకకుండా, కొద్ది దూరం నుంచే నమస్కరించుకుంటే శ్రేయస్కరమేమో? ఆలోచించదగ్గ విషయం!

🌈 *కుమ్మరి మంటపం* 🌈

💫 తలయేరు గుండు దాటగానే, శ్రీవారి మహాభక్తుడైన కుమ్మరి భీమన్న, స్వామివారికి గుర్తుగా ఒక మంటపాన్ని కట్టించాడు. అదే *"కుమ్మరి మంటపం"* గా పేరు గాంచింది. ఆ ప్రదేశంలోనే భీమన్నను స్మరణకు తెచ్చేవిధంగా; ఆ కుమ్మరివాని కుటుంబీకుల శిల్పాలు, కుమ్మరిసారె చెక్కబడిన శిలాఫలకాలు ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలలో చెప్పబడుతోంది. కానీ ఇప్పుడా మంటపం, శిలాఫలకాలు, రెండూ కనుమరుగై పోయాయి.

🌈 *మైసూరు గోపురం* 🌈

💫 తలయేరు గుండు దాటిన తరువాత 250వ మెట్టు వద్ద నాలుగు ద్వారబంధాలు, ఐదంతస్తులు గలిగిన గోపురాన్ని *"మైసూరు గోపురం",* లేదా *"రెండవగోపురం",* లేదా *"కొత్త గోపురం"* అని పిలుస్తారు. ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో మట్లకుమార అనంతరాజు నిర్మించాడు. బహుశా, మైసూరు నుండి రప్పించబడ్డ శిల్పులతో నిర్మించబడడం వల్ల ఈ గోపురానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. గోపురమంటపంలో కుడి ప్రక్కన ఉన్న కుడ్యంపై "శ్రీనివాసుడు" వారికి నమస్కరిస్తున్న అనంతరాజు తల్లిదండ్రులైన తిరువెంగళనాథుడు-చెన్నమ్మల విగ్రహాలు కూడా చెక్కబడి; వారి పేర్లు తెలుగు తమిళ భాషల్లో లిఖించబడి ఉన్నాయి. మరికొంత దూరం ప్రయాణించాక 375వ మెట్టుపై, గజేంద్రమోక్షానంతరం గజరాజును ఆశీర్వదిస్తున్న శ్రీమహావిష్ణువు శిల్పం ఒక పర్వతశిలపై హృద్యంగా చెక్కబడి, ఈ మార్గానికి ఎడమ ప్రక్కగా కనబడుతుంది.

💫 ఇప్పటి వరకూ మనం - అలిపిరి మార్గం ద్వారా నడక ప్రారంభించి, 375 సోపానాలను అధిగమించి, మొసలి బారి నుండి గజరాజును రక్షించిన శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాం.

💫 మరి కొన్ని మెట్లు ఎక్కిన తరువాత, 535 వ మెట్టుపై ముకుళిత హస్తాలతోనున్న ఆంజనేయుని శిల్పం దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు సాగితే, 680వ మెట్టు వద్ద 1928వ సం. లో పునరుద్ధరించబడ్డ పదహారు స్తంభాల *"రాజవోలు మండపం"* కనబడుతుంది. యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా, ఈ మంటపంలో ఇరుప్రక్కలా విశాలమైన అరుగులు ఉంటాయి. తిరుమలకు సంబంధించిన గ్రంథాలలో గానీ, స్థానికుల వద్దగాని ఈ మంటపానికి ఇలా చిత్రమైన పేరు రావడానికి గల సమాచారం లభించలేదు.



🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*

*అలిపిరి మార్గం - చారిత్రిక, పౌరాణిక విశేషాలు*

🌈 మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, ఈ మార్గం తిరుపతి పట్టణ శివార్లలో, ముకుళిత హస్తాలతో ఉన్న గరుత్మంతుని విగ్రహం సమీపం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో, రహదారికి అవతలి వైపు నుండి చూస్తే సుదూరంగా, రెండు పర్వతశిఖరాల మధ్యన శ్వేతవర్ణంలో తళుకులీనుతున్న *"గాలిగోపురం"* దర్శనమిస్తుంది. రాత్రివేళల్లో, విద్యుద్దీప కాంతులతో ఈ గోపురం మరింత శోభాయమానంగా గోచరిస్తుంది.

💫 ఇక్కడే ఉన్న తి.తి.దే. కార్యాలయంలో మన సామాన్లను, పాదరక్షలను జమచేసి టోకెన్లు పొందుతాం! ఆ ప్రక్కనే ఉన్న అండర్ బ్రిడ్జి ద్వారా కొన్ని అడుగులు వేయగానే అలిపిరి మార్గానికి *'మొట్టమొదటి మెట్టు'* కనపడుతుంది. అక్కడే భక్తిశ్రద్ధలతో టెంకాయ, కర్పూరహారతి సమర్పించుకుని, భక్తులు నడకయాత్ర ప్రారంభిస్తారు. కొందరైతే, పరమపవిత్రంగా భావించబడే ఈ సోపానానికి సాష్టాంగ నమస్కారం కూడా చేస్తారు. అక్కడి నుండి మరికొద్ది అడుగుల దూరంలో తిరుమలకు వెళ్లే వాహన మార్గాన్ని దాటగానే, బాటకు ఇరుప్రక్కలా పొడవాటి విశ్రాంతి మండపాలు కనిపిస్తాయి.


🌈 *విశ్రాంతి మండపాలు*

💫 ఒక్కొక్కటి పదహారు శిలాస్తంభాలతో నిర్మించబడి, అలనాటి రాచరికపు ఆనవాళ్లను జ్ఞప్తికి తెచ్చే ఈ మంటపాలు, 16వ శతాబ్దంలో మెట్ల కుమార అనంతరాజు చక్రవర్తిచే నిర్మింపబడి, తరువాతి కాలంలో అనేకసార్లు పెక్కుమంది రాజుల ద్వారా మరమ్మత్తులు చేయబడ్డాయి. వందల ఏళ్ళ నుంచి తిరుమలయాత్ర చేపట్టే భక్తులు మొట్టమొదటగా తిరుపతిలోని గ్రామదేవత గంగమ్మను, తరువాత గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుని; తీర్థప్రసాదాలు సేవించి, ఎడ్లబండ్లు, గుర్రపు బళ్ళపై, సాయం సమయానికి ఈ విశ్రాంతి మంటపాలను చేరుకునే వారు. వీటిలో అన్ని తరగతుల వారికి ఆదర పూర్వకమైన స్వాగతమిచ్చి, అందరికీ సమానంగా షడ్రుచులతో కూడిన ఆహారం వడ్డించబడేది. ఈ మంటపాలలో, కుటుంబంలోని పిల్లా, పెద్ద, పరిచారకులు, పల్లకీలు, డోలీలు మోసే కూలి వారు; అందరూ రాత్రికి విశ్రాంతి తీసుకొని, మర్నాటి ఉదయం స్నానపానాదులు, ఉదయపు భోజనాలు ముగించుకుని, మూటా-ముల్లె సర్దుకుని, తాబేటికుండల్లో త్రాగునీటిని నింపుకుని, డప్పులు వాయించుకుంటూ, అలిపిరి మెట్ల ద్వారా తిరుమల యాత్రకు సమాయత్త మయేవారు

🙏 *శ్రీవారి పాదమండపం* 🙏

💫 విశ్రాంతిమంటపాల నుండి బయలుదేరగానే, మనకు ఎడమ ప్రక్కగా *"శ్రీవారి పాదమండపం"* దర్శనమిస్తుంది. 1628వ సంవత్సరంలో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని *"పడాలమంటపం"* అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించి రెండు ఆసక్తికరమైన కథనా లున్నాయి:

🌈 *మొదటి కథనం:*  

💫 శ్రీకాళహస్తి ప్రాంతంలో, శ్రీవేంకటేశ్వరుని భక్తులైన ఒక హరిజన కుటుంబం; అలాగే కాంచీపురం నందుండే మరో హరిజన కుటుంబం ప్రతి శ్రావణ శనివారం నాడు ఉపవాసముండి శ్రీవారికి పిండి తళిగలు నైవేద్యంగా సమర్పించేవారు. ఒక కుటుంబం సమర్పించే పిండిముద్దపై స్వామివారి కుడిపాదం, మరో కుటుంబం సమర్పించుకునే పిండిముద్దపై ఎడమపాదం యొక్క ముద్రలు పడేవి. వాటి కొలతలను బట్టి, ఇరువురు హరిజన భక్తులు కుడి ఎడమ పాదరక్షలను తోలుతో అందంగా తయారు చేసి, వాటిని శిరస్సుపై నుంచుకొని ఈ మందిరానికి చేరుకునేవారు. ఆశ్చర్యకరంగా ఈ రెండు జోళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు తయారు చేసినప్పటికీ, ఒకదానికొకటి సరిజోడుగా నుండేవి. స్వామివారు వ్యాహ్యాళికి, వేటకు, తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారిని కలవటానికి కొండ దిగినప్పుడల్లా ఆ చెప్పులు ధరించి కొండకోనల్లో తిరగటం వల్ల అవి త్వరగా అరిగిపోయేవి. సగం అరిగిపోయిన ఆ పాదరక్షలకు గుర్తుగా, ఈ ఆలయంలో ఇప్పుడు కూడా లోహంతో తయారు చేయబడిన అనేక పాదరక్షలను మనం దర్శించుకోవచ్చు. ఈ లోహపు పాదాలను భక్తుల శిరస్సుపై తాకించి శెఠారిగా ఇచ్చే సాంప్రదాయం ఈ ఆలయంలో నేటికీ ఉంది.

🌈 *మరో కథనం ప్రకారం -* 

💫 శ్రీవారి పరమభక్తుడైన తిరుమలనంబి ప్రతిరోజు తిరుమల కొండపై నుండి క్రిందకు వచ్చి, ఈ ప్రాంతంలో ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఒక సంవత్సరం పాటు, ఉదయపు వేళల్లో, భగవద్రామానుజుల వారికి రామాయణ రహస్యాలను బోధించేవాడు. మధ్యాహ్నానికి తిరిగి తిరుమలకు చేరుకొని స్వామివారి పాదాలను దర్శించుకునే వాడు. ఒకరోజు కాలయాపన కావడంవల్ల శ్రీవారిని మధ్యాహ్న సమయంలో దర్శించుకో లేకపోయిన తిరుమలనంబి చింతను తీరుస్తూ, ఆ రామాయాణ పారాయణం జరిగే చోటనే శ్రీవారు తన శిలాపాదాలను సాక్షాత్కరింప జేశారు. క్రమంగా, ఆ ప్రదేశంలో ఒక మందిరం నిర్మింపబడి, వెయ్యేళ్ళుగా ఆ పాదాలు పూజల నందు కుంటున్నాయి. 2001వ సంవత్సరంలో, ఈ మందిరం నందు స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది. 

💫 మొదటి కథనం అనూచానంగా వస్తున్నది కాగా, శ్రీవారి పాదమంటపం ముందున్న తి.తి.దే. వారి సమాచారపటం రెండవ కథనాన్ని బలపరుస్తోంది.

💫 అయితే, కొన్ని గ్రంథాలు మాత్రం తిరుమలనంబి దర్శనార్థం వెలయింప బడిన శ్రీవారి శిలాపాదాలను *"శ్రీపాదాలు"* గా ఉటంకిస్తూ, అవి అలిపిరి మార్గంలోనే మరికొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఉన్నట్లుగా చెప్పబడుతోంది. కానీ అందుకు తగ్గ చారిత్రక ఆధారాలు లేవు. ఏ కథనం నిజమైనప్పటికీ ఈ పవిత్రపాదాలను దర్శించి నంతమాత్రాన పాపాలు పటాపంచలవుతాయని అనాదిగా భక్తులు విశ్వసిస్తున్నారు.




*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


🙏 *గగనాన గరుత్మంతుడు* 🌈

💫 మరికొద్ది దూరం వెళ్లిన తర్వాత, 870వ మెట్టు వద్ద ఎడమ ప్రక్కగా, పైకి చూస్తే; దూరంగా ఉన్న పర్వతశిఖరం అంచులో కొనదేరిన నాసికతో, దృఢమైన దవడలతో, వెడల్పాటి ఫాలభాగంతోనున్న *"గరుత్మంతుడు"* దర్శనమిస్తాడు. శేషాచలశిఖరాల్లో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గరుత్మంతుని ముఖారవిందం, స్వామివారు భక్తరక్షణకో, శిష్టరక్షణకో లేదా ముల్లోక సంచారానికో బయల్వెడలి నప్పుడు, వారిని ఆకాశమార్గంలో సత్వరమే గమ్యం చేర్చడానికి ఖగరాజు సిద్ధంగా ఉన్నట్లనిపిస్తుంది. ఆవిధంగా, సప్తగిరులలో ఒకటైన *"గరుడాద్రి'* సార్ధక నామధేయ మయ్యింది.

💫 గగనాన వెలసిన గరుత్మంతుని దర్శించగానే వచ్చిన నూతనోత్సాహంతో, నడక వేగం పుంజుకుంటుంది. తదుపరి, 1150వ మెట్టుపై పూర్తిగా శిథిలమై, నేలమట్టం అయిన *"యలక్కాయల మంటపం"* కానవస్తుంది. ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర కూడా అందుబాటులో లేదు. కానీ, ఈ మంటపం సమీపంలో ఒకటి రెండు వెలక్కాయ చెట్లు ఉండడంతో; ఒకప్పుడు ఇక్కడ వెలగచెట్లు అధికంగా ఉండేవని, ఆ కారణంగా ఇది *"వెలక్కాయల మంటపం"* గా పిలువబడి; కాలాంతరంలో అదే *"యలక్కాయల మంటపం"* గా రూపాంతరం చెంది ఉండవచ్చని ఊహించ వలసి వస్తోంది. దాని ప్రక్కనే ఉన్న బండరాతిపై ముకుళిత హస్తాలతో సుసంపన్నమైన ఆంజనేయుణ్ణి, శ్రీవేంకటేశ్వరుణ్ణి, వారికి భక్తితో నమస్కరిస్తున్న రాజదంపతులను దర్శించుకోవచ్చు.

💫 సువిశాలమైన ఈ మెట్టుపై నుండి వెనుకకు తిరిగి చూస్తే, ఇక్కడి నుంచి తిరుపతి పట్టణం మనోహరమైన ఆధునిక దృశ్యకావ్యంగా ఆవిష్కృత మవుతుంది.

💫 మరికొన్ని మెట్లు ఎక్కిన తర్వాత 1800వ మెట్టు వద్ద, వామనావతార విగ్రహం ప్రక్కగా, ఒక ప్రాచీనమైన నాలుగుస్తంభాల మంటపంలో నమస్కార భంగిమలో ఉన్న రామానుజుల వారి ప్రతిమను దర్శించుకోవచ్చు. మొత్తం మెట్లలో సగభాగాన్ని విజయవంతంగా అధిరోహించి నందుకు గాను భక్తులను అభినందిస్తున్నట్లున్న రామానుజుల వారికి ప్రణమిల్లి ముందుకు సాగుదాం




🌈 *గాలి గోపురం* 🌈

💫 2083 వ మెట్టును ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముందుగా, బాటకు ఎడమ ప్రక్కన ఓ చిన్న ఆలయంలో ఉన్న వీరాంజనేయుని దర్శించుకుని, కొన్ని అడుగులు వేయగానే సమున్నతమైన *"గాలిగోపురం"* కనబడుతుంది. దీనిని కూడా మట్లకుమార అనంతరాజు ప్రభువే నిర్మించాడు. అద్భుతమైన కుడ్యశిల్పాలతో అలరారుతున్న ఈ బహుళ అంతస్తుల గోపురాన్ని నడకదారికి తలమానికంగా చెప్పుకోవచ్చు. ఈ గోపురానికా పేరు రావడం వెనుక రెండు కథనాలున్నాయి -

💫 మొదటిది ఏ విధమైన దేవాలయము లేకుండా ఖాళీగా ఉండటం వల్ల, ఈ గోపురాన్ని మొదట్లో *"ఖాళీగోపురం"* గా పిలిచేవారు. కాలక్రమేణా అదే *"గాలిగోపురం"* గా మారిందని కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. అయితే, నడకదారిలో దీనికంటే ముందున్న రెండు గోపురాల సమీపంలో కూడా ఏ విధమైన దేవాలయాలు లేవు. కాబట్టి ఈ కథనం సందేహాస్పదమే!

💫 మరో కథనం ప్రకారం – 
సమున్నతమైన ఈ ప్రదేశానికి సమీపంలో వేరే శిఖరాలేవీ లేనందున ఇచ్చట గాలి హోరుగా వీస్తుంది. ఉధృతంగా వీచే వాయువును ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు గావున దీనికి *"గాలిగోపురం"* అనే పేరొచ్చింది. ఈ కథనం విశ్వసనీయంగానే అనిపిస్తుంది.

💫 ఈ ప్రదేశానికి చేరుకోగానే, సప్తగిరులలో తొట్టతొలి కొండ అధిరోహించటం పూర్తయినట్లుగా భావిస్తారు. ఈ గోపురంపై తిరునామం, ఇరుప్రక్కలా శంఖు-చక్రాలు అమర్చబడి, వైకుంఠాన్ని తలంపుకు తెస్తుంది. ఈ వైష్ణవ చిహ్నాలను విద్యుద్దీపాలతో అలంకరించడం వల్ల, వీటిని రాత్రి సమయాల్లో తిరుపతి పట్టణం నుంచి కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశంలోనే, నవనాథులలో ఒకరైన *"గోరక్షానాథ్"* అనే సిద్ధుడు కొన్నేళ్లపాటు తపస్సు చేసినట్లుగా చెబుతారు. ఇచ్చట కొన్ని సమాధులు, ఒక పాడుబడ్డ పుష్కరిణి కూడా ఉన్నట్లు కొన్నిచోట్ల పేర్కొనబడింది. గాలిగోపురానికి కొంచెం దూరంలో, పాలరాతి శిల్పాలతో విరాజిల్లుతున్న, ఈ మధ్యనే పునరుద్ధరించబడిన, ప్రాచీనమైన కోదండ రామాలయం ఉంది. నడకదారి ప్రారంభంలో, మొదటి గోపురం లేదా మహాగోపురం వద్ద మనం తీసుకున్న *"దివ్యదర్శనం"* టోకెన్ ను, గుర్తింపు పత్రాన్ని చూపిస్తే, గాలిగోపురం వెనుకనే ఉన్న తి.తి.దే. కార్యాలయంలో దర్శన సమయాన్ని నిర్దేశిస్తారు.

💫 తరువాత, ఇక్కడే ఉన్న తి.తి.దే. "అన్నప్రసాద కేంద్రం" లో కానీ, లేదా అధిక సంఖ్యలో ఉన్నటువంటి తినుబండారాల అంగళ్లలో గానీ అల్పాహార కార్యక్రమాన్ని ముగించుకుని; ప్రక్కనే ఉన్న తి.తి.దే. జలప్రసాద కేంద్రంలో దప్పిక తీర్చుకొని; ఓ వృక్షరాజం చుట్టూ వృత్తాకారంలో నిర్మించబడ్డ, విశాలమైన సిమెంట్ చప్టాపై కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అవసరమైన వారికి, అక్కడే తి.తి.దే. వారి ప్రథమ చికిత్సా కేంద్రం కూడా అందుబాటులో ఉంటుంది. గాలిగోపురం దాటగానే సుదీర్ఘమైన నడకదారి ప్రారంభమవుతుంది. మెట్లెక్కే అవసరం తక్కువగా ఉండడంతో, అలసటగా ఉన్న శరీరం కొద్దిగా తెరపిన పడుతుంది. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత 2,104వ సోపానం వద్ద, *"చిట్టెక్కుడు"* అనే ప్రాంతంలో లింక్ రోడ్డు ప్రారంభ మవుతుంది. బహుశా, ఈ ప్రాంతం నుండి మెట్లు సువిశాలంగా, ఎత్తు తక్కువగా ఉండి; నడకదారి అధికంగా ఉండటంతో యాత్రికులు సులభంగా నడవ గలగటం వల్ల; దీనికి "చిట్టెక్కుడు" అనే పేరు వచ్చి ఉంటుంది.

🌈 *జింకల పార్కు* 🌈

💫 "చిట్టెక్కుడు" ప్రాంతంలో ఉన్న అనేక సువిశాలమైన మెట్లు దాటగానే, 2566వ మెట్టు వద్ద జింకల పార్కు కనబడుతుంది. లోహపుతీగెల కంచె లోపల చిగురుటాకులు సేవిస్తూ, చారెడేసి కళ్లతో, చెంగుచెంగునా గంతులు వేస్తూ; జింకలు, లేళ్లు, వాటి కూనలు కన్నులపండువ చేస్తాయి. చిన్నపిల్లలయితే అలసటనంతా ఆదమరచి, జింకలతో మమేకమై, ఆ మూగజీవాలకు చిరుతిళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తారు. అటవీశాఖ సిబ్బంది వాటికి శ్రద్ధగా, నిర్ణీత సమయాల్లో, తగినంత సమతులాహారాన్ని అందిస్తారు గావున; పిల్లలను వారించి ఆ వన్యప్రాణుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పెద్దవారిగా మనపై ఉంది!

💫 పురాణాల్లోకి వెళితే వైఖానస ఆగమాలలో యాగాలకు, యజ్ఞాలకు అంతులేని ప్రాముఖ్యత ఉంది. అందువల్లనే తిరుమలలో కళ్యాణ మంటపాలతో పాటు, అనేక యాగశాలలు కూడా ఉన్నాయి. వివిధ ఉత్సవాలు, సేవలతో పాటుగా, తరచు యజ్ఞయాగాదులు కూడా జరుగుతూనే ఉంటాయి. యాగం జరిగే ప్రదేశంలో కృష్ణజింకలు ఉండి తీరాలని శాస్త్రం ఘోషిస్తోంది. కావున, తిరుమల క్షేత్రంలో కృష్ణజింకలను కొలువుంచటం జరిగింది.

💫 ఈ జింకల పార్కు వద్ద లోయర్ బ్రిడ్జి ద్వారా వాహనమార్గమైన ఘాట్ రోడ్డును దాటుకొని, కొన్ని మెట్లెక్కగానే "శ్రీకృష్ణావతారం" ముగ్ధ మనోహరంగా కానవస్తుంది!

💫 3,550 మెట్లెక్కి, కొండకోనల్లో తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి, నడక ద్వారా తిరుమలకు చేరుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. దారిలో, దర్శించదగ్గ విశేషాలు అనేకం ఉన్నా, సరైన సమాచారం లేకపోవడం వల్లనే చాలా మంది భక్తులు నడకదారి అందచందాలను ఆసాంతం ఆస్వాదించలేరు. అటువంటి వారికి కరదీపికగా ఉపయోగపడాలనే లక్ష్యంతో; మెట్ల సంఖ్యను ఉదహరిస్తూ మేము చూచిన, విన్న, చదివిన విశేషాలన్నింటిని; అందుబాటులో ఉన్న వాటి పౌరాణిక, చారిత్రక, సమకాలీన సమాచారంతో సహా; ఈ ప్రకరణాలలో పొందుపరచ బడ్డాయి. మేము చూచినది చూచినట్లుగా, విన్నది విన్నట్లుగా లేదా, చదివినది చదివినట్లుగా పేర్కొనబడింది. ఇప్పటికీ పదిలంగా వున్న కొన్ని చారిత్రక చిహ్నాలను ఎంతో నిశితంగా పరిశీలించినప్పటికీ మేము గమనించ లేకపోయే అవకాశం కూడా ఉంది. దానికి మన్నించగలరు! 

💫 ఈసారి తిరుమలను సందర్శించుకునే టప్పుడు, అలిపిరి నడకమార్గం ద్వారా కొండకు చేరుకొని, మార్గమధ్యలో ఉన్న విశేషాలన్నింటినీ తప్పనిసరిగా అవలోకిస్తారని ఆశిస్తున్నాం!




*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*

🙏 *భద్రాంజనేయుని విగ్రహం* 🙏

💫 2,680వ మెట్టు మరో మైలురాయి!! స్థానికులు ఈ ప్రదేశాన్ని *"ఏడో మైలురాయి ప్రాంతంగా"* గా పిలుస్తారు. ఈ ప్రదేశంలో కొండపై నుండి వాహనాలు దిగే ఘాట్ రోడ్డు మరియ అలిపిరి మెట్లమార్గం ఒకదానికొకటి అత్యంత సమీపంలో సమాంతరంగా ఉంటాయి. దశావతారాల్లో చిట్టచివరిదైన కల్క్యావతారం కూడా ఇక్కడే ఉంటుంది.

💫 1979వ సంవత్సరంలో ఈ ప్రదేశం నందు జరిగిన ఒక దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని, అటువంటివి పునరావృతం కాకుండా అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పి వి ఆర్ కే ప్రసాద్ గారి నేతృత్వంలో; ఇక్కడ ఘాట్ రోడ్డుకు కాలిబాటకు మధ్యనున్న ప్రదేశంలో, దుష్టగణాలకు సింహస్వప్నమైన భద్రాంజనేయుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. పది అడుగుల ఎత్తైన సువిశాల పీఠంపై ముప్ఫై అడుగులతో సమున్నతంగా ఉన్న గదాధారుడైనటువంటి హనుమంతుని విగ్రహం; శాకిని-ఢాకిని పిశాచాలను, దుష్టశక్తులను, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. పెద్దాపురం సమీపంలోని ఒక కుగ్రామంలో నివసించే తోగు లక్ష్మణస్వామి అనే కళాకారుడు ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా వేళ్ళకు ఉన్న గోళ్ళు, వ్రేలాడుతున్న జులపాలు, వస్త్రానికి ఉన్న ముడుతలు వంటి సూక్ష్మాతి సూక్ష్మమైన శరీరభాగాలను సైతం అత్యంత నైపుణ్యంతో, ముచ్చట గొలిపేలా తీర్చిదిద్దాడు. సిమెంట్‌తో నిర్మించబడ్డ ఈ విగ్రహానికి మొజాయిక్ పూత పూసి, శిలావిగ్రహాన్ని తలపుకు తెచ్చేలా, సుదీర్ఘకాలం నిలిచి ఉండేలా ఈ విగ్రహం తయారు చేయబడింది.

💫 ఈ ప్రదేశం చూడచక్కనైన ఉద్యానవనము, పూలమొక్కలు, విశ్రాంతి స్థలము, త్రాగునీటి సదుపాయాలు, చిరుతిళ్ళ దుకాణాలతో అలరారుతూ; విహారస్థలాన్ని తలపించటంతో, దాదాపు 2,700 మెట్లు ఎక్కిన అలసట కాస్తా దూదిపింజలా తేలిపోయి, మనసు, శరీరం మిగిలిన ప్రయాణానికి సమాయత్తమవుతాయి.

💫 బాటకు ఎడం ప్రక్కగా, తప్పనిసరిగా చూసి తీరవలసిన అటవీశాఖ మ్యూజియం ఉంది. అందులో శేషాచల పర్వతాల నైసర్గిక స్వరూపం, వాటి ఆవిర్భావం, వాటికున్న పౌరాణిక ప్రాశస్త్యం, స్థానిక అడవులలో సంచరించే జంతుజాతులు, అక్కడ పెరిగే వృక్షజాలం, ఔషధమొక్కలు, లభించే ఖనిజాలు, ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివసించే కోయజాతుల గురించిన విస్త్రుతమైన సమాచారం వర్ణచిత్రాల రూపంలో వివరణతో సహా పొందుపరచబడింది.

💫 ఇక్కడి నుంచి కొద్ది అడుగుల దూరంలో స్థానికులు *"ఏడవ మైలు మంటపం"* గా పిలిచే, ఎనిమిది స్తంభాల విశ్రాంతి మండపం కనబడుతుంది.

💫 మరో 20 మెట్లు ఎక్కిన తరువాత వచ్చే ఎత్తయిన ప్రదేశాన్ని, *"మామండూరు మిట్ట"* అని పిలుస్తారు. ఇక్కడే పోలీస్ ఔట్ పోస్ట్ కూడా ఉంది. మరికొద్ది మెట్లు ఎక్కిన తర్వాత, పూర్తిగా పునరుద్ధరించబడిన *దొరసాని మంటపం* కనబడుతుంది. 

💫 సుదీర్ఘమైన 2815వ మెట్టుపై ఎడం ప్రక్కన *"సాష్టాంగ పడి ఉన్న భక్తబృందం"* యొక్క శిల్పాన్ని చూడవచ్చు. మరికొద్ది దూరంలో, ఒకదాని తర్వాత ఒకటిగా రెండు పేరులేని విశ్రాంతి మండపాలు కానవస్తాయి.

🌈 *ముగ్గుబావి మంటపం* 🌈

💫 తదుపరి, 2,840వ మెట్టుపై బాటకు ఎడం ప్రక్కగా *దాసాంజనేయుని ఆలయం* దర్శనమిస్తుంది. ఈ ఆలయం వెనుక; ఈనాడు చెట్టు-పుట్ట తో నిండి ఉన్న ఓ విశాలమైన, లోతైన లోయను *"ముగ్గుబావి"* గా పిలుస్తారు. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రదేశంలో ముగ్గురాయి అధికంగా లభించేది. ఇదివరకు కొన్ని వందల ఏళ్ళపాటుగా శ్రీవారి ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా తీర్చిదిద్దబడే రంగవల్లులకు కావలసిన ముగ్గు కోసం ఇక్కడున్న రాతిని త్రవ్వేవారు. కాలాంతరంలో ఈ ప్రదేశం లోతైన సువిశాలమైన దిగుడుబావిగా తయారై, అదే *"ముగ్గురాతి బావి"* లేదా *"ముగ్గుబావి"* గా పిలువబడేది. వర్షపునీటితో, పర్వతసానువుల్లో నుంచి వచ్చే జలధారలతో ఈ లోయ నిండినప్పుడు పొంగిపొరలే నీరు అంతర్వాహినిగా దిగువకు ప్రయాణించి, తిరుపతి పట్టణంలో నేడు *"మంచినీటి కుంట"* గా పిలువబడే చెరువుకు చేరుకుంటుందని స్థానికుల నమ్మకం. ముగ్గుబావి ప్రదేశంలో నరసింహస్వామి ఆలయం కూడా ఉండటం చేత, అక్కడి నుంచి ప్రవహించే నీటిని కలుపుకోవడం వల్ల తిరుపతిలోని "మంచినీటి కుంట" ను *"నరసింహతీర్థం"* గా పిలిచేవారు. ఈ మధ్యనే అభివృద్ధి చేయబడి, చుట్టూ ప్రహరీ నిర్మించబడిన ఈ చెరువు ఒడ్డున ఆలనా పాలనా లేకుండా పడి ఉన్న, శయనభంగిమ లోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దాదాపు వెయ్యేళ్ళ క్రితం విష్ణుద్వేషియైన కుళోత్తుంగ చోళుడు ఆనాటి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన చిదంబరం ఆలయం లోనుంచి పెరికివేసి, సముద్రంలో పారవేసిన *"గోవిందరాజస్వామి"* విగ్రహం ఇదేనని కొందరు అభిప్రాయపడతారు.

💫 ముగ్గుబావి వద్ద శ్వేతచక్రవర్తి కుమారుడైన *"శంఖుడు"* భగవత్సాక్షాత్కారం కోసం తపస్సు చేయగా, వేట నిమిత్తం అడవికి వెళ్ళిన శ్రీనివాసుడు ఆ భక్తునికి రాజు వేషంలో దర్శనమిచ్చాడని పురాణాల్లో చెప్పబడింది

🌈 *త్రోవ నరసింహాలయం*🌈

💫 మరికొన్ని మెట్లు ఎక్కిన తరువాత - 2,850 మెట్టు పై – మార్గానికి ఎడమ ప్రక్కగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న వటవృక్షం చుట్టూ పూలమొక్కలు పెంచి, నయనానందకర మైన విశ్రాంతి స్థలంగా తీర్చిదిద్దారు. దాని తరువాత వచ్చేదే *"త్రోవ నరసింహాలయం."* దీన్ని చాలా శక్తివంతమైన నారసింహ క్షేత్రంగా చెబుతారు. హిరణ్యకశిపుని వధ ఇక్కడే జరిగినట్లు, తదనంతరం ఉగ్రనరసింహుణ్ణి చెంచులక్ష్మి ఈ ప్రదేశంలోనే శాంతింప జేసినట్లు కొన్ని పురాణాల్లో చెప్పబడింది. ఈ మధ్యనే పునరుద్ధరించబడిన ఈ ఆలయపు గర్భాలయంలో స్వయంభువుగా వెలసిన, సాలగ్రామశిలా రూపుడైన నారసింహుడు లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని దర్శనమిస్తాడు. ఈ ప్రదేశంలో కనకధారాస్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతుండడంతో, ఇక్కడ తి.తి.దే. వారు ఆ స్తోత్రం చెక్కబడి ఉన్న గ్రానైట్ పలకలను అమర్చారు. ఈ ఆలయాన్ని యాత్రికులకు మార్గమధ్యంలో దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో సాళువ నరసింహరాయలు 1485వ సం. లో పునరుద్ధరించాడు. ఈ ప్రాంతాన్ని సప్తగిరుల్లో ఒకటైన *"వృషభాద్రి"* పర్వతంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని గురించిన ఇంకా అనేక పౌరాణిక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

💫 ఈ ఆలయం వెనుకనున్న మరో చిన్న ఆలయంలో *యోగా నరసింహస్వామి* *'లింగస్వరూప"* ధారియై దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దాటిన వెనువెంటనే, దర్శన సమయం నిర్దేశించి ఉన్న టోకెన్ పై తి.తి.దే. వారు అధికారిక స్టాంపు ముద్రిస్తారు. ఆ ముద్ర ఉంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

💫 అక్కడి నుండి కొన్ని మెట్లు దిగిన తరువాత, కొండపై నుండి వాహనాలు దిగివచ్చే రహదారిని వ్యతిరేకదిశలో కలుపుతూ నూతనంగా నిర్మించిన బడ్డ తోరణం ఉంది. ఆ తోరణం గుండా వాహనమార్గం లోనికి ప్రవేశించిన తరువాత; అక్కడి నుండి మెట్లు లేని, సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉండే నడకదారి ప్రారంభమవుతుంది.


🌈 *అవ్వాచారి కోన* 🌈

💫 త్రోవ నరసింహాలయం సందర్శించుకుని, కొన్ని మెట్లు దిగి, తోరణం గుండా వాహనమార్గం లోనికి వ్యతిరేకదిశలో ప్రవేశించగానే కొద్ది దూరంలో మనకు కుడిప్రక్కగా ప్రప్రథమ వీక్షణంలో భీతి గొలిపించే, సువిశాలమైన, కొన్ని వందల అడుగుల లోతైన, పచ్చదనంతో పరిఢవిల్లే ఆగాధం కనిపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఆ లోయ అంచులకు లోహపు కంచె వేయబడింది. ఆ లోయలోకి దృష్టిసారించ గానే, ప్రకృతి శోభతో మనసు పులకరించిపోతుంది. లోయకు ఆవల ఉన్న సమున్నతమైన శిఖరాలపై నెలకొల్పబడిన గాలిమరలు గిరగిరా తిరుగుతూ, విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తలపిస్తాయి. సమస్త వృక్షజాతులకు ఆలవాలమైన ఈ లోయలో, ఇప్పటికీ అనేక క్రూరమృగాలు సంచరిస్తాయని స్థానికులు విశ్వసిస్తారు. ఎడమవైపున ఆకాశాన్ని చుంబించే శిఖరాలు, కుడివైపున పాతాళం స్పృశించే లోయ సృష్టిలోని సోయగమంతా ఇక్కడే ప్రోగు పడినట్ల నిపిస్తుంది. రహదారికి ఎడమ ప్రక్కన ఉన్న శిఖరపుటంచులలో పెరుగుతున్న నిమ్మగడ్డి సువాసనలు ఆ ప్రదేశమంతా గుబాళిస్తాయి.

💫 ఆ లోయకు *"అవ్వాచారి కోన"* అనే పేరు రావడం వెనుక లెక్కలేనన్ని కథనాలున్నాయి. *"అవ్వాచారి"* అనే వైష్ణవభక్తుడు అచ్చట నివసించడం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరంటారు. ఆ ప్రదేశంలో విపరీతమైన చలి మొదలవ్వడంతో భక్తులు *"అబ్బా... చలి"* అనుకుంటూ నడిచే వారని, కాలాంతరంలో అదే నుడువడి "అబ్బా చలి కోన" గా, తరువాత "అవ్వాచారి కోన" గా రూపాంతరం చెందిందని కొందరు అభిప్రాయపడతారు. మరి కొందరైతే, దాదాపు 3000 మెట్లు ఎక్కేసరికి, అవ్వలు "నా పని సరి" అంటూ చతికిల పడేవారని, ఆ కారణంగా ఆ లోయను "అవ్వ పని సరి" గా పిలిచేవారని, కాలగమనంలో ఆ పదబంధం "అవ్వాచారి" గా రూపు దిద్దుకున్నదని భావిస్తారు.


🙏 *సప్త మాతృకలు* 🙏

💫 ఆ నడక దారిలోనే రహదారికి ఎడమప్రక్కగా ఒక చిన్న తలుపులు లేని ఆలయంలో, ఏడు రాతి విగ్రహాలు పూజలందుకుంటుంటాయి. ఈ ఏడుగురు అమ్మవార్లను *"సప్తమాతృకలు"* లేదా *"శ్రీవేంకటేశ్వరుని అక్కగార్లు"* గా పిలుస్తారు. ఇక్కడ రోడ్డు మార్గం వేసేటప్పుడు కొన్ని దుర్ఘటనలు సంభవించి, ఎంతకూ రోడ్డు పూర్తికాక పోవడంతో, ఎక్కడో కీకారణ్యంలో చెట్టు క్రింద ఉన్న ఈ ఏడుగురు అమ్మవార్లను ఈ ప్రదేశానికి తెచ్చి పూజించడంతో రోడ్డు కార్యక్రమం సజావుగా సాగి పోయిందని చెబుతారు. ఈ దేవతలందరూ బ్రహ్మచారిణులు అని, ఆకాశరాజు తన కుమార్తె-అల్లుని రక్షణ నిమిత్తం ఈ ఏడుగురు యువతులను అలమేలుమంగమ్మ వారితో పాటుగా పంపించారని, వారు పగలంతా ఈ ఆలయంలో నివసిస్తూ, రాత్రి వేళల్లో సూక్ష్మరూపధారులై సప్తగిరి శిఖరాలను కాపు కాస్తుంటారని ప్రజలు విశ్వసిస్తారు. కొందరైతే, ఈ ఏడుగురు సాక్షాత్తు స్వామివారికి అక్కగార్లని, తమ ముద్దుల తమ్ముణ్ణి నిరంతరం కనిపెట్టుకుని ఉంటారని కూడా విశ్వసిస్తారు. వీరిని దర్శించుకుని వెళితే, ఆ దేవతల అనుగ్రహంతో శ్రీవారి దర్శనం సజావుగా జరుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతి పట్టణపు గ్రామదేవత అయిన గంగమ్మతల్లి శ్రీవారికి మరో అక్కగారని భావిస్తారు. అందుకే, ప్రతిసంవత్సరం స్వామివారి ఆలయం నుండి ఆ దేవతకు సకల లాంఛనాలతో పుట్టింటి కానుకలను పంపించే సాంప్రదాయం ఈనాటికీ ఉంది.

💫 'అవ్వాచారి కోన' అందాలను ఆస్వాదిస్తూ, సప్తమాతృకలను సందర్శించుకుని, దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడవగానే మనకు ఎడమ ప్రక్కగా *"మోకాలిమిట్ట గోపురం"* దర్శనమిస్తుంది.




🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


🌈 *మోకాలిమిట్ట గోపురం లేదా అచ్యుతరాయ గోపురం* 🌈


💫 మోకాలి మిట్ట ప్రారంభంలో, 2910వ మెట్టు వద్ద మూడు అంతస్తులు, కలశాలు, రెండు ద్వారబంధాలతో నిర్మించబడ్డ అద్భుతమైన గోపురాన్ని *"మోకాలిమిట్ట గోపురం"* లేదా *"అచ్యుతరాయ గోపురం"* గా పిలుస్తారు. 16వ శతాబ్ది ప్రథమార్థంలో "తుళువ" వంశపు చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అయిన అచ్యుతరాయలు ఈ గోపురాన్ని నిర్మించాడు. అయితే, ఈనాడు మనం చూస్తున్న గోపురం మాత్రం, తిరుపతికి సమీపాన ఉన్న కొత్తూరు గ్రామంలోని ఒక శిథిలమైన ఆలయానికి చెందినది. 1998వ సం. లో, ఆ గోపురాన్ని ఇక్కడకు తరలించి, పూర్తిగా శిథలమైపోయిన అసలు గోపురం స్థానంలో దానిని పునఃస్థాపించారు. ఇప్పుడున్న మెట్లదారి నిర్మించడానికి ముందు అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం సప్తమాతృకల ఆలయ సమీపం నుండి పెద్ద లోయ లోనికి దిగి, మళ్లీ ఎత్తైన మెట్లెక్కితే ఈ గోపురాన్ని చేరుకునేవారు. ఇక్కడి నుండి ప్రారంభమయ్యే మెట్లు చాలా ఎత్తుగా, ఎక్కడానికి క్లిష్టంగా ఉండేవి. ఆ మెట్లను మోకాళ్ళపై చేతులు ఆన్చి, ఆపసోపాలు పడుతూ ఎక్కాల్సి వచ్చేది. అందువల్ల ఇది "మోకాలిమిట్ట గోపురం" గా ప్రసిద్ధికెక్కింది. 

💫 అయితే, నూతన మెట్ల మార్గం నిర్మించిన తరువాత, ఇప్పటి మెట్లు అంత కష్టంగా లేవు. అయినప్పటికీ మెట్లు నిరారుగా ఉండటం వల్ల, మధ్య మధ్యలో నడకబాట అతి తక్కువగా ఉన్నందువల్ల, ఇప్పటికీ ఈ మెట్లను అధిరోహించడం కొద్దిగా శ్రమతో కూడుకున్నదే!

💫 సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువై ఉండే, సప్తగిరులలో ఒకటైన వెంకటాద్రిపర్వతం ఇక్కడే ప్రారంభ మవుతుందని చెబుతారు. అందుచేత ఈ మెట్లు అత్యంత పవిత్రమైనవి. 

💫 అన్నమాచార్యుడు తన బాల్యంలో మొట్టమొదటిసారిగా తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు తెలియనితనంతో, పాదరక్షలు ధరించి ఈ మోకాలిపర్వతం మెట్లు ఎక్కడం ప్రారంభించగానే సొమ్మసిల్లి పోయాడు. ఆ క్షణంలో అలమేలుమంగ అమ్మవారు అన్నమయ్యకు సాక్షాత్కరించి సాలగ్రామశిలగా వెలసిన శ్రీనివాసుడు నివసించే వెంకటాద్రి పర్వతాన్ని పాదరక్షలతో అధిరోహించరాదని నచ్చజెప్పింది. దాంతో తన తప్పు తెలుసుకొన్న అన్నమయ్య పాదరక్షలను విసిరివేసి, ఆ శ్రీనివాసుని స్తుతిస్తూ *శ్రీవేంకటేశ్వరశతకం* అనే నూరు పద్యాలు కలిగిన సంకలనాన్ని ఆశువుగా కీర్తించాడు. 

💫 తరువాతి కాలంలో ఇంకెందరో మహానుభావులు కూడా ఈ పర్వతాన్ని మోకాళ్ళతో అధిరోహించారు. అంతటి పరమ పవిత్రమైన ఈ పర్వతం మెట్లలో, కనీసం కొన్నింటినైనా, ఇప్పుడు కూడా చాలామంది మోకాళ్ళతో అధిరోహిస్తారు. మరికొందరు సుమారు ఆరు వందలకు పైగా ఉన్న ఈ మెట్లన్నింటినీ పసుపు కుంకుమలతో పూజిస్తూ, వాటికి కర్పూరహారతి నిస్తూ, కొండ పైకి చేరుకుంటారు. ఈ మెట్లు ఎక్కుతున్నంత సేపు తిరుమల క్షేత్రంలో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రసారమయ్యే అన్నమయ్య కీర్తనలు చాలా దగ్గరగా వినిపిస్తుంటాయి. ఉదయం ఎంత త్వరగా బయల్దేరినప్పటికీ మోకాళ్ళ పర్వతం చేరుకునేటప్పటికి దాదాపు మధ్యాహ్నం కావటంతో, ఈ మెట్లెక్కుతున్నప్పుడు చలికాలంలో కూడా చిరుచెమటలు పడతాయి. అయినా ఎప్పటికప్పుడు మెట్ల సంఖ్యను చూస్తూ, జోరుగా వినవస్తున్న గోవిందనామాలలో వంత కలుపుతూ, కొండను సమీపిస్తున్నామనే ఆనందంతో శారీరక బాధను మరచిపోతాం.

🙏‌ *త్రోవ భాష్యకారుల సన్నిధి* 🙏

💫 "మోకాళ్ళ పర్వతాన్ని" మోకాళ్ళతో అధిరోహించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీమద్రామానుజాచార్యుల వారు. ఆ విధంగా పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళకు గాయ మవ్వడంతో, మార్గమధ్యంలో కొంతసేపు విశ్రమించాడు. ఆ విషయం తెలియగానే తిరుమలలో నివసించే, వారి గురువుగారైన తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వార్ పరుగు పరుగున కొన్ని మెట్లు దిగివచ్చి, విశ్రాంతి తీసుకుంటున్న రామానుజాచార్యుల వారిని పరామర్శించి, కొండపైకి స్వాగతం పలికారు. వారు కొండపై నుంచి వస్తూ, కొన్ని ఆమ్రఫలాలను శ్రీవారి ప్రసాదంగా తెచ్చి రామానుజునుకి ప్రసాదించారు. వాటిని అత్యంత భక్తితో స్వీకరించిన రామానుజులవారు, ఉచ్ఛిష్టాన్ని (ఫలం తినగా మిగిలన మామిడి టెంకలు) అక్కడే వదిలివేశారు. కొన్నాళ్ళకు ఆ టెంకలు మొక్కలుగా మొలచి, వృక్షాలై తియ్యటి ఫలాలను ప్రసాదిస్తూ, బాటసారులకు నీడనిచ్చేవి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మామిడి చెట్లు కూడా, ఆ చెట్ల సంతతికి చెందినవే!

💫 ఆ విషయం తెలుసుకున్న తరువాతి తరాలవారు అక్కడ నమస్కార ముద్రలోనున్న రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో, ఆ ప్రదేశం *"భాష్యకార్ల సన్నిధి"* గా పేరు గాంచింది. కొండకు వెళ్ళే త్రోవలో ఉండటం వల్ల దీన్ని *"త్రోవ భాష్యకార్ల సన్నిధి"* గా కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అక్కడ, 3,260వ మెట్టు వద్ద, రామానుజుల వారికి దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ సన్నిధికి ఎదురుగా ఉన్న శిలపై పాదపద్మాలు చెక్కబడి ఉన్నాయి. అవి రామానుజులవారు పూజించుకునే *"శ్రీవారి పాదాలు"* అని కొందరు, *"రామానుజుల వారి పాదాలు"* అని మరికొందరు భావిస్తారు.


🌈‌‌ *అమ్మవారి సారె పెట్టెలు* 🌈 

💫 రామానుజుల వారికి నమస్కరించుకుని మరికొన్ని మెట్లెక్కగానే మనకు కుడిప్రక్కగా 3302వ మెట్టుపై; నాలుగు భుజాలతో కోణాలతో తీర్చిదిద్దినట్లున్న, చారలు కలిగిన, పూర్వకాలంలో ఉపయోగించుకునే *"కావడిపెట్టలు (40– 50 ఏళ్ళ క్రితం మనం ఉపయోగించుకున్న ట్రంకు పెట్టెలు)"* లేదా *"భోషాణం పెట్టెల"* ఆకారంలో కొన్ని రాతి శిలలు అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. వీటికి సంబంధించి, ఆసక్తికరమైన కథనాలున్నాయి:

🌈 *ఒక కథనం ప్రకారం:*

💫 సీతారామలక్ష్మణులు వనవాసానికి వెడలుతున్నప్పుడు కైకేయి, ఏడువారాల నగలు తనతో తోడ్కొని వెళ్ళటానికి సీతమ్మవారిని అనుమతించింది. ఆ నగల పెట్టెలను సీతమ్మవారు వనవాస సమయంలో ఇక్కడ భద్రపరచగా, సీతమ్మవారు వాటిని తిరిగి తీసుకోక పోవడంతో అవే కాలాంతరంలో శిలలుగా మారాయి. అయితే, సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో తిరుమల క్షేత్రానికి వచ్చినట్లు ఏ రామాయణ కావ్యంలోనూ ఉటంకించక పోవటంవల్ల ఈ కథనం సందేహాస్పద మనిపిస్తుంది.

🌈 *మరో కథనం ప్రకారం:* 

💫 పద్మావతి పరిణయానంతరం, ఆకాశరాజు తనయ పద్మావతితో పాటుగా; విశేషమైన ధనకనకాలను, వజ్రఖచిత ఆభరణాలను, వస్తు విశేషాలను, ఖాద్యసామగ్రినీ పెద్ద పెద్ద కావడి పెట్టెలలో సర్ది, సారెగా పంపించాడు. వందలాది ఏనుగులు, గుర్రాలు ఈ పెట్టెలను తమపైకెక్కించుకొని, అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ, మోకాలి పర్వతాన్ని సమీపించాయి. అంతకు కొద్ది సమయం ముందే "శ్రీవారిమెట్ల" మార్గం ద్వారా ఆనందనిలయానికి చేరుకున్న శ్రీనివాసుడు పద్మావతీదేవితో, 'కొత్త కాపురానికి కావలసిన వస్తుసామగ్రి అంతా వచ్చినట్లేనా?' అని ప్రశ్నించాడు. అందుకు పద్మావతీదేవి తనతో పాటుగా తెచ్చుకున్న సారె నంతా గుర్తుకు తెచ్చుకుని సకలమైన వస్తువులు సమకూరాయని, కేవలం కరివేపాకు మాత్రం తీసుకురాలేదని చెప్పింది. ఈ తప్పిదానికి అలక వహించిన శ్రీనివాసుడు అంతటి చక్రవర్తి ఆకాశరాజుకు ఇంత చిన్న విషయం తెలియదా?, అని ప్రశ్నించాడు. అంతేకాకుండా, ఆకాశరాజు ప్రేమగా పంపిన సారెనంతా తిరస్కరించి, ఇకనుండి తిరుమల క్షేత్రంలో కరివేపాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించమని కూడా శాసించాడు. తిరుమలలో ఆ శాసనం నేడు కూడా అమలులో ఉంది, ఆంధ్రులు పులిహోరలో తప్పనిసరిగా ఉపయోగించే కరివేపాకు, తిరుమల ఆలయం లోని పులిహోర ప్రసాదంలో మచ్చుకు కూడా కానరాదు. ఈసారి జాగ్రత్తగా గమనించండి.

💫 శ్రీవారి అస్వీకారానికి గురైన ఆ సారె పెట్టెలన్ని బండశిలలుగా మారి, మోకాలిమిట్ట మార్గంలో కలియుగారంభం నుంచి అచేతనంగా పడి ఉన్నాయి.

💫 అట్టి సారెపెట్టెలలో ఒకదానిపై ఆంజనేయుడు కొలువుండి, ఆకాశరాజు తన కుమార్తెకు, అల్లునికి ఎంతో ప్రేమగా పంపించిన సారెకు రక్షణభారం వహిస్తూ, స్వామివారు ఎప్పుడెప్పుడు కరుణించి ఈ సారెను స్వీకరిస్తారా అని ఎదురు చూస్తున్నాడు. సకల పాపాలను తొలగించి, అందరినీ అక్కున జేర్చుకునే ఆ శ్రీవారు ఇంత స్వల్ప విషయానికి అలక పూనటం వెనక ఏ మహత్తరమైన పరమార్థం దాగి ఉందో? ఎంతటి లోకకళ్యాణం సమకూర నుందో? స్వామివారి ఈ చిత్రమైన లీలలో మనబోంట్ల ఊహకందని నిగూఢ రహస్యమేదో నిక్షిప్తమై ఉండి ఉంటుంది!

💫 సారె పెట్టెపై కొలువై ఉన్న ఆంజనేయునికి అంజలి ఘటించి, కొన్ని మెట్లు ఎక్కి, సరిగ్గా 3550వ మెట్టు చేరగానే, సాక్షాత్తు శ్రీవారు సాక్షాత్కరించిన ఆనందం కలుగుతుంది. అప్రయత్నంగా భక్తుల నోటినుండి వెలువడే గోవిందనామాలతో దిక్కులు పిక్కటిల్లుతాయి.

💫 దారి పొడవునా మెట్లను పూజించుకుంటూ రాగా మిగిలిన పసుపు కుంకుమను ఆఖరి మెట్టుకు సమర్పించటంతో, 3,550వ మెట్టుపై ఎల్లవేళలా పెద్ద *"కుంకుమ రాసి"* అరుణ వర్ణంలో కానవస్తుంది. అక్కడే కర్పూరనీరాజనం కూడా సమర్పించి, 'స్వామివారి సన్నిధికి ఎపుడెపుడు ఏతెంచుదామా' అన్న ఆత్రుతతో రహదారిపై కొద్ది దూరం నడుచుకుంటూ, ఈనాడు "టోల్ గేటు మంటపం" గా పిలువబడే 48 స్తంభాల ప్రాచీన మంటపం దాటి, మనకు కుడి ప్రక్కనే ఉన్న గోదాదేవి ప్రతిమకు నమస్కరించు కుంటాం! ఈ మంటపాన్నే ఇదివరకు *'బళ్ళమంటపం'* పిలిచేవారు. మెట్లు నిర్మించడానికి పూర్వం, ఎడ్లబళ్ళు, గుర్రపుబళ్ళపై కొండకు చేరుకున్న భక్తులు, తమ బళ్ళను ఈ మంటపం ముందు నిలపడం వల్ల ఈ మంటపానికి 'బళ్ళమంటపం' అనే పేరొచ్చింది.

💫🙏 చివరిగా, అక్కడే ఉన్న తి.తి.దే. కార్యాలయంలో మనం అలిపిరి వద్ద నడక ప్రారంభించే ముందు జమ చేసిన సామానులను, పాదరక్షలను తిరిగి తీసుకుని, ముందే బుక్ చేసుకున్న కాటేజీకో లేదా క్యూ కాంప్లెక్సుకో పరుగుపెడతాం!

💫 కానీ, వందేళ్ళ క్రితం పరిస్థితి ఎంతో భిన్నంగా ఉండేది. అత్యంత ప్రయాసతో, దాదాపు రెండు రోజులు ప్రయాణం చేసి, అలసి సొలసి తిరుమలకు విచ్చేసిన భక్తులు ఈ మంటపాల లోనే విశ్రాంతి తీసుకునే వారు. వాటిలో స్నానపానాలకు, భోజనాదులకు, విశ్రాంతికి కావలసిన వసతులన్నీ ఉండేవి. రాత్రికి మంటపాల లోనే విశ్రమించి, మరునాటి ఉదయం పరగడుపుతో కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకుని, మహాద్వార సమీపంలోనే తలనీలాలు సమర్పించుకొని, స్వామిపుష్కరిణిలో పవిత్రస్నానమాచరించి, క్షేత్రనియమానుసారం ముందుగా ఆదివరాహుణ్ణి దర్శించుకొని, తడిబట్టలతోనే మహాద్వారం లోనుంచి నేరుగా విమానప్రదక్షిణ మార్గానికి చేరుకుని, పొర్లుదండాలు పెట్టుకుని, విమానవేంకటేశ్వరునికి సమస్కరించి, గర్భాలయం ముందున్న "కులశేఖరపడి" చేరుకుని, స్వామివారిని తనివితీరా ఆపాదమస్తకం దర్శించి, ముడుపులు చెల్లించి, ప్రసాదాలను అమృత తుల్యంగా భావించి ఆర్తితో స్వీకరించేవారు.

🙏 తదుపరి తిరుమల యాత్రకు అప్పుడే నాందీ ప్రస్తావన జరిగేది కూడా!

💫 తిరుమల నుండి తిరిగి స్వగృహానికి చేరుకున్న తరువాత, ఇరుగుపొరుగు వారందరినీ ఆహ్వానించి, యాత్రా విశేషాలను మధురానుభూతులను కథలు కథలుగా వర్ణించి, తమతో బాటుగా తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాలను, చిరు కానుకలను పంచిపెట్టి వేడుకలా జరుపు కునేవారు.


Share

No comments :

Please submit your suggestions, recommendations & queries

Translate

Popular Posts

  • image
    Tirumala Seva Details
    https://tirupatibalaji.ap.gov.in/#/sevaCal Advance Booking | Seva in Tirumala | Tirumala Daily Sevas Arjitha Seva  means performing seva to ...
  • image
    Tirumala Accommodation
      https://tirupatibalaji.ap.gov.in/#/accommodationCal TTD has built cottages in Tirumala that can be rented by pilgrims. There are 3 categor...
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
    TTD as part of Eco-friendly initiative to sell incense sticks made out of the used sacred garlands of TTD temples. Devotees of Sri Venkatesw...
  • image
    Matrusri Tarigonda Vengamamba | Tarigonda
    The deity of Tarigonda Sri Lakshmi Narasimha Swami who is known for Sathya Pramanalu (Promise) and consideration towards the devotees who ar...
  • image
    Tirumala Varaha Swamy Temple
      On leaving the Vaikuntha (the celestial abode of Lord Vishnu) Lord Srinivasa hid Himself in an anthill in a forest. One day, he came out o...
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    How to Buy 2023 TTD Calendar Online - Buy Now!
    TTD started Online sales of the 2023 Calendar are sold online. Also you can buy Small & Big Diary and Table Top Calendar. Please follow ...
  • image
    Auspicious Dates for Property Registration
  • image
    Srivari Padalu at Tirumala
    Following the scratch caused to the historically significant Srivari Padalu located in the highest peak of Narayanagiri in Tirumala, TTD has...
  • image
    Tirumala TTD Wedding Prasadam (Kalyana Talambralu)
    Special blessings for all newly weds from Lord Venkateswara. Blessings in return for your Wedding card. Akshintalu, Kumkamam,Kankanam, Ashir...

Loading...

TirumalaHills Archive

  • ►  2023 (2)
    • ►  February 5 - February 12 (1)
    • ►  January 8 - January 15 (1)
  • ▼  2022 (87)
    • ►  December 25 - January 1 (2)
    • ►  November 27 - December 4 (2)
    • ►  November 20 - November 27 (1)
    • ►  November 13 - November 20 (1)
    • ►  November 6 - November 13 (2)
    • ►  October 30 - November 6 (2)
    • ►  October 16 - October 23 (3)
    • ►  October 9 - October 16 (1)
    • ►  October 2 - October 9 (1)
    • ►  September 18 - September 25 (3)
    • ►  September 11 - September 18 (1)
    • ►  August 28 - September 4 (1)
    • ►  August 21 - August 28 (9)
    • ▼  June 19 - June 26 (30)
      • Tirumala Alipiri అలిపిరి మార్గం ❤💕
      • How to reach Tirumala by ✈️️🚂🚍🚘🚴👣🚶
      • Tirumala Srivari Vimana Pradakshinam - విమానప్రదక్...
      • Tallapaka Annamacharya | తాళ్ళపాక అన్నమాచార్య 💕🙏
      • Important Choultry Phone Numbers at Tirumala
      • Why Hathiramji Played LUDO with Sri Venkateshwara ...
      • How to send marriage invitation card to Tirumala? ...
      • How to Book Free Kalyana Vedika at Tirumala 👫💐 త...
      • Why Britishers Handover Tirumala Temple to Mahanth...
      • Srivari Kalyanam & Loan from Kuber
      • Tirumala Inside Temple Darshanam
      • Tirumala Sri Venkateshwara Swamy Moola Virat Darsh...
      • Tirumala Bangaru Vakili
      • Vimana Pradakshinam
      • Sri Padmavathi Srinivasa Parinayam Festival
      • Contribution of Bhagavad Ramanujacharya
      • Srivari Brahmotsavams
      • Vijayanagara Empire as Srivari Devotee
      • Srivari Varshikotsava / Annual Sevas
      • Tirumala Srivari Temple - A Religious & Spiritual ...
      • Tarigonda Vengamamba
      • Tirumala Paksha & Maasovastavam
      • Tirumala Sri Bhu Varaha Swamy Temple
      • Tirumala Srivari Devotee & History - Ananthalwar
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 1
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 2
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 2
      • Srivari Bhakhagresarulu - Volume 1
    • ►  May 29 - June 5 (23)
    • ►  January 2 - January 9 (5)
  • ►  2021 (71)
    • ►  October 17 - October 24 (1)
    • ►  September 26 - October 3 (1)
    • ►  September 12 - September 19 (1)
    • ►  September 5 - September 12 (4)
    • ►  August 22 - August 29 (2)
    • ►  August 15 - August 22 (3)
    • ►  August 8 - August 15 (12)
    • ►  August 1 - August 8 (22)
    • ►  July 25 - August 1 (25)

Global Page Views

Article Categories

TirumalaHills (157) Seva (23) Festivals (19) TTD (14) Visiting Places (11) Astrology (8) Muhuratham (8) Video (8) YouTube (8) SVBC (3) Accommodation (2) Darshanam (2) Photos (1)

Write your queries / suggestions

Name

Email *

Message *

Translate

Popular Photos

  • image
    Tirumala Seva Details
  • image
    Tirumala Accommodation
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
  • image
    Matrusri Tarigonda Vengamamba | Tarigonda
  • image
    Tirumala Varaha Swamy Temple
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    How to Buy 2023 TTD Calendar Online - Buy Now!
  • image
    Auspicious Dates for Property Registration

Loading...

Play - Om Namo Venkatesaya

Facebook

ॐ TirumalaHills తిరుమలహిల్స్ तिरुमालाहिल्स ತಿರುಮಲಹಿಲ್ಸ್ திருமளாவுக்கு ॐ

Loading...

Search...

Powered by Blogger
All Right Reserved | Copyright © 2008-2021, TirumalaHills.org